స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 81

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
జన్మసంసార బంధనాలలో చిక్కుకొన్న ఓ మానవుడా! హృదయాన్ని జలధిగా చేసుకో. ప్రియతమ దైవాన్ని దర్శించు. అప్పుడు చూడు. కెరటాలు లేచి బంధనాలు తెగాయో లేదో!!!
***
యజ్ఞం పూజనీయం
ప్ర ణు త్యం విప్ర మధ్వరేషు సాధుమగ్నిం హోతార మీళతే నమోభిః
ఆ యస్తతాన రోదసీ ఋతేన నిత్యం మృజంతి వాజనం ఘృతేన
॥ ఋ.5-1-7.
ప్రతిపదార్థం:- యః = ఎవడు; రోదసీ= ఊర్ధ్వ- అధోలోకాలను; ఋతేన= ఋతం చేత; తతాన= విస్తరింపచేసెనో; అధ్వరేషు= యజ్ఞాలలో; త్వమ్= ఆ జగత్ప్రసిద్ధమైన; విప్రమ్= మహా మేధావి లేదా సర్వజనులకు తృప్తి కలిగించేవాడో; సాధమ్= సర్వులకు మేలును కలిగించేవాడో; హోతారమ్= మహా దాతయో; అగ్నిమ్= సర్వజనాభ్యుదయ కారకుడో; తమ్= ఆ భగవానుని; ను= విద్వాంసులైనవారు నిజంగా; నమోభిః= నమస్కారాలచే; ప్ర+ఈవతే= భక్తితో పూజిస్తున్నారు.
భావం:- ఊర్ధ్వ- అధోలోకాలను ఋత మహిమచేత విస్తరింపచేసినవాడూ, యజ్ఞాలను చేసే మేధావి జనులకు సంతృప్తిని కలిగించేవాడూ, వారికేగాక సర్వజనులకు మేలు చేకూర్చేవాడూ, సర్వ జనాభ్యుదయకారుడూ, మహాదాత ఐన ఆ భగవానుని విద్వాంసులు భక్తితో నమస్కారాలతో పూజిస్తున్నారు.
వివరణ:- వేద సంబంధమైన దైవ యజ్ఞంలోని అగ్నిహోత్రమూ, లౌకికాగ్ని మరియు దాని ద్వారా చేయబడు వివిధ దేవతారాధనలు సమానమే నని చాలమంది భావిస్తూ ఉంటారు. వారీ మంత్రార్థాన్ని ముఖ్యంగా అవగాహన చేసికోవలసి యుంది. ఈ మంత్రంలో ‘విప్రమ్’ అన్న విశేషణం కనబడుతుంది. మేధావి- విశేషబుద్ధి కలిగియున్నవాడు అని దాని అర్థం. లౌకికాగ్నిలో అట్టి బుద్ధెక్కడ ఉంటుంది? ఇట్టి అగ్ని కంటె విశిష్టమైన వేదాగ్నిని గురించి-
ఆ యస్తతాన రోదసీ ఋతేన= ఋతం ద్వారా నిరోధింపబడని- నిశే్ఛదింపబడని - సర్వవ్యాపకమైన శాసన శక్తి ద్వారా సమస్త జగత్‌సృష్టి నిర్మాణం చేసినవాడు అని వేదమంత్రం తృతీయ చరణంలో అభివర్ణించింది. ఇట్టి శక్తి ఆ భౌతికాగ్నిలో ఎక్కడ? అగ్ని మొదలైన శబ్దాలు ఎలా భౌతిక పదార్థ వాచకాలో అలాగే అవి పరమేశ్వర వాచకాలు కూడ. ఎక్కడ భౌతిక వాచకాలో ఎక్కడ పరమేశ్వర వాచకాలో ఎలా గ్రహించాలి? దానికి శ్రీ దయానంద మహర్షి సత్యార్థ ప్రకాశంలో ఒక స్పష్టమైన పద్ధతిని వివరించారు.
‘‘అగ్ని మొదలైన నామాలను పరమేశ్వర వాచకాలుగా గ్రహించేందుకు ప్రకరణం- విశేషణం కారకాలవుతాయి. దీనిని బట్టి స్తుతి, ప్రార్థన, ఉపాసన, సర్వజ్ఞ, వ్యాపక, శుద్ధ, సనాతన మరియు సృష్టికర్త మొదలైన విశేషణాలు ప్రయోగింపబడినచోట ఆ నామాలకు పరమేశ్వర వాచకంగా అర్థం గ్రహించాలి (సత్యార్థ ప్రకాశం- ప్రథమ సముల్లాసం)
ప్రస్తుత మంత్రంలో అగ్ని శబ్దానికి విప్ర మరియు సృష్టికర్త అన్న విశేషణాలతోబాటు సర్వజ్ఞానులు ఆయనకు నమస్కరిస్తున్నారు అని కూడ చెప్పబడటం చేత అగ్ని శబ్దానికర్థం పరమేశ్వరుడే అని గ్రహించాలి. దీనినిబట్టి దేవయజ్ఞాది యజ్ఞాలలో అగ్నిదేవునకు పూజలు చేయరు కాని జగత్సృష్టికర్త మరియు జగన్నాథుడైన మహాదేవుని ఉపాసన చేస్తారు అన్న భావార్థాన్ని గ్రహించాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని దయానందమహర్షి-
‘‘సమస్త శుభకర్మల యందు తనతోబాటుగా ఇతరులకు మేలు కలుగు విధంగా యజ్ఞాలలో ఈశ్వరోపాసన చేయడం మానవులకు సముచితం’’ (సంస్కారవిధి- సామాన్య ప్రకరణం) అని సత్యార్థప్రకాశంలో పేర్కొన్నారు. ప్రస్తుత మంత్రంలోని నాల్గవ చరణంలో యజ్ఞం ద్వారా చేయబడే ఈశ్వరోపాసన వలన కలిగే ఫలం సుందరంగా ఇలా చెప్పబడింది.
ఇంకావుంది...