స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
భావం:- ఓ ఆత్మా! ప్రాణాలు నీ వైభవప్రాప్తికై నిన్ను ప్రకాశింపచేస్తున్నాయి. అదే నీ అద్భుతమైన సుందరమైన జన్మ. నీవు విష్ణువుతో సమానమైన స్థానాన్ని శరీరంలో పొంది శరీరేంద్రియాలలో గుప్తంగా ఉన్న సామర్థ్యాన్ని సంరక్షిస్తున్నావు.
వివరణ:- ఆత్మ అమరం. శరీరం మరణశీలి. ఆత్మ అవినాశి. శరీరం వినాశి. కాని పూర్వజన్మవాసనా ప్రభావంచేత అమర్త్యో మర్త్యేనా స యోనిః’ (ఋ.1-164-30) శుద్ధమూ, పవిత్రమూ, విమలమూ, ఉజ్జ్వలమూ అమరమైన ఆత్మ అశుద్ధమూ అపవిత్రమూ, సమలమూ మరణశీలియైన శరీరమనే చీకటి కొంపలోనికి వచ్చి చిక్కుకొనిపోయింది. ఆత్మ అద్భుత జన్మ చిత్రమిదే.
ఆత్మ విష్ణు సమానమైనట్టిది. విష్ణువు విశ్వంలో వ్యాపించియుండి విశ్వాన్ని నడిపిస్తున్నాడు. శరీరంలో ఉన్న ఆత్మ శరీరానే్న నడిపిస్తూంది. ఈ అభిప్రాయానే్న ఈ మంత్రంలోని ద్వితీయార్థం ‘‘పదం యద్విష్ణోః.... గోనామ్’’ విష్ణుసమానమైన స్థానాన్ని వహించి శరీరగత ఇంద్రియాల గుప్తశక్తిని సంరక్షిస్తున్నావు అని ప్రకటించింది. సృష్టిలోని పదార్థాలలో ఉన్న అద్భుత సామర్థ్యమేదియుందో అది అంతా భగవానుడు ప్రసాదించిందే. ఇదేరీతిగా కళ్లలో చూచే శక్తి, చెవులలో వినే శక్తి, అట్లే ఇంద్రియాలలోని వివిధ శక్తులు అన్నీ ఆత్మశక్తియే. ఈ విషయాన్ని కఠోపనిషత్తు మరింత విస్పష్టంగా చెప్పింది.
యేన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంశ్చ మైథునాన్‌
ఏ తే నైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతత్‌॥ కఠోపనిషత్తు 2-1-3॥
భావం:- దేని ద్వారా రూప- రస- గంధ- శబ్దస్పర్శలు తెలుసుకోబడతాయో దానిద్వారానే విశేష విషయాలు గూడ గ్రహించబడతాయి. అలా తెలియబడే ఆ విశేష శేషమేది?
కన్ను- ముక్కు-నోరు మొదలయిన ఇంద్రియాల ద్వారా సర్వకార్య నిర్వహణను చేస్తూ కూడ ఏది కండ్లకు కానరాదో అది అన్నింటిని నడిపిస్తూ ఉంది. నడిచే ఇంద్రియాలు నశించినా అది మాత్రం నశింపక శేషించి యుంటుంది. అదే ఆత్మ. జగదాధరుడు సకల జగత్తును నడిపిస్తూ ఉన్నా సాధారణ జనులకు కానరాని విధంగా దేహమనే బ్రహ్మాండంలోనే ఉంటూ సర్వకార్యనిర్వహణ చేస్తున్న ఆత్మకూడ కళ్ళకు కానరాదు. విశ్వాత్మకు ఆత్మకు మధ్య ఎంత చక్కని పోలిక ఉంది!! దానిని ఇలా భావించవచ్చు. ఓ జీవుడా! నీవు లఘురూపుడవైన ఈశ్వరుడవు. నీవు నీ ఘనతను విస్మరించరాదు. విశ్వంలోని సర్వవస్తుజాలమూ భగవానునే వర్ణిస్తున్నాయి. శరీరగత ప్రాణాలు ఆత్మమహిమనే వ్యాఖ్యానిస్తున్నాయి. శరీరంలో ఆత్మ ఉన్నంతకాలమూ ప్రాణాలు చైతన్యవంతమై ఉంటాయి. అలాకాక ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతే ప్రాణాలు కూడ విడిచి వెళ్ళిపోతాయి. ప్రశ్నోపనిషత్తులోని రెండవ ప్రశ్న నాల్గవ వచనంలో దీనిని గురించిన ఒక అందమైన వర్ణన కనబడుతుంది. కళ్లు-ముక్కు- చెవులు శరీరాన్ని ధరించి ఉండేవాళ్ళం మేమేనన్న అహంకారం వహించాయట. అప్పుడు ప్రాణాలు ‘‘ఇంద్రియాలూ! మీరిలా అహంకరించకండి. నేనే ఐదువిధాలుగా విభాగం చెంది ఐదింద్రియాల రూపంగా ఈ శరీరాన్ని వహించాను’’అని అన్నాయట. కాని ఇంద్రియాలకు విశ్వాసం కలుగలేదు. అప్పుడు ఇంద్రియాలకు జ్ఞానోదయం కలిగేందుకు ప్రాణాలేమిచేసాయో - వాటికేవిధంగా జ్ఞానోదయం కలిగిందో ప్రశ్నోపనిషత్తు ఇలా వర్ణించింది.
సో- భిమానా దూర్ధ్వముత్క్రామత ఇవ, తస్మిన్నుత్కామత్యథేతరే సర్వ ఏవోత్క్రామంతే,
తస్మింశ్చ ప్రతిష్ఠమానే సర్వ ఏవ ప్రాతిష్ఠంతే
తద్యథా మక్షికాః మధుకరరాజానముత్క్రామంతం
సర్వా ఏవోత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్ఠమానే
సర్వా ఏవ ప్రాతిష్ఠంత ఏవం వాఙ్మనశ్చక్షుః
శ్రోత్రం చ తే ప్రీతాః ప్రాణం స్తున్వన్తి॥
భావం:- ప్రాణాలు కొంచెంగా పైకి లేచాయి. వెంటనే ఇంద్రియాలు కూడ తమ శక్తిని కోల్పోవసాగాయి. ప్రాణాలు కొంచెం సమయంవరకు నిలిచియున్నాయి. ఇంద్రియాలు మరల శక్తివంతమై నిలిచాయి.
*
ఇంకావుంది...