స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

*
ఓ సోదరా! జన్మ జన్మలకు పూర్వం నుండి కాదు కాదు అనాది కాలంనుండి బ్రహ్మలోకాన్ని వీడి భూమికి దిగిన పిమ్మట మా వద్ద వున్న నిధి ఆ ఒక్కటే. అదే మా చిత్తం. మోక్షరూపమైన అమృతత్వధనాన్ని పొందాలనే లోభబుద్ధి చేత మా ఏకైక ధన నిధి అయిన చిత్తాన్ని కోల్పోయాం. కాని ఏ రక్షక భట నిలయంలో ఫిర్యాదు చేయగలం? అదృష్టవశాత్తు దివ్యలోక పురుషులతో పరిచయమేర్పడింది. ఆ దొంగ ఒక చోట కాదు అన్ని చోట్లా ఉంటాడని వారు చెప్పారు. ఆ చిత్తచోరుని కొరకు నేలపై గల ప్రతి వనాన్ని అనే్వషించాం. పర్వతాలు - నదీనదాలు - సముద్రాలు ఇలా అన్నింటిలో వెదికాం. కాని ఆ దొంగ జాడ తెలియరాలేదు. ఎవరో మా వద్దకు వచ్చి ఆర్యులారా! ఆ దొంగ గుహలో దాగి వున్నాడు అని చెప్పారు. ఇక దొరికిపోయినట్టే సంబరపడిపోయాం. దొంగ దొరికిపోతే ఎవరికైనా సంతోషంగానే వుంటుంది కదా! దొంగిలింపబడిన చిత్త్ధనం కూడా దొరికిపోతుందని ఎగిరి గంతేసాం. గుహ వద్దకు చేరుకొన్నాం. కాని గుహ కటిక చీకటి నిండియుంది. ఏదీ కనబడటంలేదు. ఎలా చూడగలం? దొంగ నెల పట్టుకోగలం?
ఈ సందర్భంలో ‘స జాయసే మథ్యమానః’ మధించు కనబడగలడు అన్న వేదవాణి వినబడింది. సమిధలను తెచ్చి వెలిగించాం. అగ్ని రగిలింది. ఇంకేముందు. అంతటా వెలుగే వెలుగు. అది ఆరిపోకుండా గాలి వీచరాదని భావించాం. నిజానికి వాయువు అగ్నికి మిత్రుడే. అతడగ్ని రగిలించాలి. కాని ఒక్కొక్కప్పుడు గాలి కూడా అగ్నిని ఆర్పివేస్తూ వుంటుంది. ఇది లోక సహజం. కాని దానికి భిన్నంగా అగ్ని ఎక్కడ రగిలింపబడుతుందో దాని నార్పివేసే వాయువు కూడా అక్కడ వీస్తుంది. అగ్నిర్యత్రాభి మథ్యతే వాయుర్యత్రాధిరుధ్యతే’ అని శేతాశ్వతరోపనిషత్తు హెచ్చరిక చేసింది. అగ్నిపుల్ల అంటించగానే అది గాలికి ఆరిపోకుండా రెండు చేతులు అడ్డుపెట్టడం అందరకు అనుభవమే కదా! ఇదే రీతిగా ఆత్మజ్ఞానం రగిలినంతనే దానిని ఆర్పివేసేందుకు వెంటనే విషయవాసనల రూపమైన గాలి బలంగా వీస్తుంది. దానితో ఆ జ్ఞానాగ్ని కొండెక్కుతుంది. కాబట్టి ఈ సందర్భంలో జీవులారా! జాగ్రత్త వహించండి. గాఢాంధకారంలో చిరుదివ్వె కూడా చాలా సహాయకారిగా ఉంటుంది. వేదమంత్ర మీ సందర్భాన్ని గుర్తించి ‘సహో మహత్ త్వామాహుః’ వెలిగిన ఆ జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేసేందుకు నీవే సమర్థుడవు. మా ప్రయత్నాలు నిరర్థకమైనవే అని జీవులు ప్రార్థించాలని హెచ్చరించింది. భగవానుడు అంధకారాన్ని నశింపజేసినట్లు ఏదైనా ఐతిహ్యముందా? లేకేమి? అదే వృత్రాసుర వధ గాథ. ‘వృత్త’ అంటే అంధకారమని అర్థం. దానిని వినాశనం చేసినవాడు భగవానుడే. అందుకే అతడు మహాబలసమర్థుడు. వృత్రాసురుని వలె మన చిత్తం కూడా చాలా బలమైనది. దానితోబాటు దానియందు పాపపంకిలం కూడా ఉంది. అది వెనుక చెప్పబడిన మథనాగ్నిలో లేదా భగవచ్చింతనాగ్నిలో పడితే భస్మమైపోతుంది. ఈ భావానే్న ఈ మంత్రం ఆహుః సహసస్పుత్రమ్= జీవుల సామర్థ్యాన్ని పరీక్షించి రక్షించేవానిగా దైవాన్ని స్తుతించింది. అంతా ‘మనస్సు’ అనే చిత్తచోరుని పట్టుకొని మా చిత్తమనే ధనాన్ని తిరిగి పొందేందుకు గుహలోనికి ప్రవేశించాం. కాని కోల్పోయిన చిత్త్ధనంతో గుహనుండి బయటకు రాలేదు. ఆ చిత్తచోరుడు ఏదో అమృతోపమానమైన ఏదో రసాయనాన్ని మా చేత త్రాగించాడు. అలా త్రాగి ఆనందంతో తేలియాడాం. ఆ విధంగా ఆ రసాయన ప్రదాత మమ్మల్ని నిత్యప్రచేతసులుగా మార్చివేసాడు. చిత్రమేమంటే ఆ చిత్తచోరుడు మమ్మల్ని తన మాయచే భ్రమింపజేశాడు. ఆ భ్రమ కూడా మాకు మంచిదే అయింది. అంగిరసులమే అయ్యాం.

ఇంకావుంది...