స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే లోకంలో అందరూ యజ్ఞ- దాన- తపో దీక్షాదులు చేయలేరు. అట్టివారు వాటి ప్రాధాన్యాన్ని గుర్తించి వాటిని ఆచరించలేని తమ అశక్తతను గ్రహించి భగవంతుని శరణాగతిని పొందితే ఆయన వారిని ‘ఆధ్రస్య చిత్ప్రమతి రుచ్యసే పితా’ తండ్రివలె ఆదరించి జ్ఞాన ప్రబోధం చేస్తాడని వేదం ధైర్యాన్ని చెబుతూంది. అంతమాత్రమే కాదు. ఎవడు అనన్యభావంతో అంటె నీవొక్కడవే దిక్కు అన్న భావంతో దైవాన్ని ఆశ్రయిస్తాడో ‘ప్ర పాకం శాస్సిప్రదిశో విదుష్టర’ అట్టి పవిత్రాత్మకు నీవే (ఆ దైవమే) మహోన్నత సర్వాదేశాలతో జ్ఞానోపదేశం చేస్తావు అని వేదం సాంత్వన పలికింది. అంటె ఆత్మజ్ఞాన సంబంధమైన సూక్ష్మాతి సూక్ష్మ విషయ గంభీరతల వరకు తీసికొనిపోయి అతడికి ఆత్మిక మరియు భౌతిక జ్ఞాన విశేషాల సంపూర్ణ జ్ఞానాన్ని ఆ దైవమే కల్పిస్తాడని భావార్థం. లోకంలో ఎవరైనా ఇంతకంటె సర్వోత్తమ ధనమెక్కడయినా లభిస్తుందా?
***
ఋషిగా తీర్చిదిద్దేవాడవు నీవే
ఇమామగ్నే శరణిం మీమృషో న ఇమమధ్వానం యమగామదూరాత్‌
ఆపిః పితా ప్రతిః సోమ్యానాం భృమిరస్యృషికృన్మర్త్యానామ్
॥ ఋ.1-31-16॥
భావం:- ఓ జ్ఞానప్రదాతా! అగ్నే! మా ఈ అపరాధాన్ని క్షమించు. ఈ మార్గానికి చాల దూరంనుండి శ్రమపడి చేరుకొన్నాం. నీవే చేరుకోదగిన ఆప్తుడవగు తండ్రివి. శాంతికాముకులకు ప్రబోధకుడవు. మరియు సంరక్షకుడవు. జన్మ మరణరూప సంసార చక్రాన్ని త్రిప్పేవాడవు నీవే. మరణశీలురైన మానవులను ఋషీశ్వరులుగా తీర్చిదిద్దగలవాడవు కూడ నీవే.
వివరణ:- మిడిమిడి జ్ఞానం (అల్పజ్ఞత)తో మానవుడు ప్రకృతి విసిరే మోహపు వలలో చిక్కుకొని జీవుడు పరమాత్మకు చాలా దూరంగా జరిగిపోతున్నాడు. ఏ లాలసగుణం చేత ప్రకృతి మాయాజాలంలోపడి పోతున్నాడో అది ఎప్పటికీ పూర్తికాదు. సరికదా ఆ ప్రకృతి మోహజాలమనే ఇంద్రజాలమే లేదా ఎండమావే పరమ సత్యప్రమాణంగా విశ్వాసాన్ని కలిగిస్తుంది. చివరకు దాని మాయలోపడి తన ఆప్తబంధువైన పరమాత్మను కూడ జీవుడు మరచిపోతున్నాడు. లోకంలో ఇట్టి జీవులెందరో! వారిలో పూర్వజన్మ సుకృత లేశమున్న జీవుడికి అదృష్టవశాత్తు ఎవరో ఒక గురువుతో సత్సంగం కలిగింది. వాని నుద్దేశించి ఆ గురువు ‘‘అరె! నీవు చాలా దూరం వచ్చేసావు.’’ ‘తద్ దూరే’ (శు.యజుర్వేదం 40-5) అని శుక్ల యజుర్వేదం పేర్కొన్నట్లుగా ఆ దైవం చాల దూరంలో ఉన్నాడని హెచ్చరించాడు. ఆ మాట వినగానే ఆ జీవుడు చాల కంగారుపడ్డాడు. అయినా ఆ జీవుడు ప్రశాంతుడై, దాంతుడై (బహిరింద్రియ నిగ్రహం) ఉపరతుడై (బాహ్య విషయాలకు మార్పుచెందని స్థిర మానసిక స్థితి) తితిక్షాయుతుడై (సహనశీలియై) సమాసిత చిత్తుడై (మనసును నిబ్బరంగా ఉంచుట) అదే మార్గంలో ముందుకే నడిచాడు. పడుతూ-లేస్తూ భగవంతుని వాకిలిముందు నిలిచి ‘ఇమామగ్నే శరణిం మీమృషో నః’ ఓ దేవా! ఈ నా అపరాధాన్ని క్షమించు. ఎందుకంటె - ‘ఇమ మధ్వానం యమగామ దూరాత్’ మేమెంతో దూరంనుండి ఈ మార్గంలో నడుస్తూవచ్చాం (అనేక జన్మపరంపరల నుండి ఈ జీవన్మరణ మార్గంలో చాలాకాలంగా నడుస్తూ వస్తున్నామని భావం) అని ప్రార్థించాడు.
సుదీర్ఘమైన మార్గంలో ప్రయాణించే సమయంలో అనేక కష్టాల నెదుర్కోవడం మరియు పలు పొరపాట్లుచేయడం సహజం. మావల్లకూడ అవే జరిగాయి. దానికి మేము పశ్చాత్తాపం చెందుతున్నాం. ఓ ప్రభూ! మరల మేమట్టి తప్పుచేయని విధంగా మాకు శక్తినిమ్ము. నీ తోడును వీడని సద్బుద్ధిని మాకిమ్ము.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు