తెలంగాణ

ఆర్థిక శాఖలో అసిస్టెంట్ల నియామకానికి రేపు రాతపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణలో 15/2015 నోటిఫికేషన్ ద్వారా ఆర్ధిక శాఖ అకౌంట్స్ శాఖలో అసిస్టెంట్ల నియామకానికి ఈ నెల 29వ తేదీన ఆబ్జెక్టివ్ పద్ధతిలో కంప్యూటర్ ఆన్ లైన్ ఒఎంఆర్ ఆధారితంగా ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు 84 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 55,239 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశామని చెప్పారు. హైదరాబాద్‌లో 22 కేంద్రాల్లో 12,650 మంది, రంగారెడ్డిలో 21 కేంద్రాల్లో 15,180 మంది, కరీంనగర్‌లో 17 కేంద్రాల్లో 11,187 మంది, వరంగల్‌లో 24 కేంద్రాల్లో 16,222 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశారు. వరంగల్ జిల్లాలో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో ఒక పరీక్ష కేంద్రంలో మార్పులున్నాయని, వాటిని అభ్యర్ధులు గమనించి తదనుగుణంగా పరీక్షకు హాజరుకావాలని ఆమె సూచించారు.