తెలంగాణ

వినయమే.. విజయ రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: వరంగల్ విజయం కొత్త చరిత్ర సృష్టించిందని అంటూనే, ఈ విజయం పార్టీ శ్రేణుల్లో గర్వం, అహంకారం పెంచకూడదని సిఎం కె చంద్రశేఖర్ రావు సూచించారు. ప్రజలతో అత్యంత వినయంగా, సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వరంగల్ ఎంపీగా ఘన విజయం సాధించిన పసునూరి దయాకర్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా ముఖ్య నేతలు బుధవారం సిఎంను క్యాంపు కార్యాలయంలో కలిశారు. పార్టీ విజయం కోసం వరంగల్ నేతలు చేసిన కృషిని సిఎం అభినందించారు. తెలంగాణ ప్రజలకు తెరాస శ్రీరామ రక్ష కావాలని, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు రక్షణ కవచంగా నిలవాలని సిఎం నేతలకు సూచించారు. రాష్ట్ర ప్రజలు తెరాసపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రజా ప్రతినిధులు, నేతలు కృషి చేయాలన్నారు. పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడు సంక్షోభం వచ్చినా వరంగల్ ప్రజలు అండగా నిలిచారని, ఈసారి ప్రభుత్వాన్ని దీవించి ఆత్మవిశ్వాసాన్ని పెంచారన్నారు. ఉద్యమ సమయంలో వరంగల్‌లో 35 లక్షలమందితో సభ నిర్వహించి అద్భుతం సృష్టించారని గుర్తు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లోనూ వరంగల్‌కు తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. వరంగల్ జిల్లాలో అతి పెద్ద టెక్సటైల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని, ఔటర్ రింగ్‌రోడ్ నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై త్వరలోనే కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇస్తామన్నారు. చాలా చిన్న కార్యకర్త అయిన పసునూరి దయాకర్‌కు అవకాశం వచ్చినట్టే, పార్టీని నమ్మితే ప్రతి ఒక్కరికీ తప్పక అవకాశం వస్తుందని, అయితే అది తమదాకా వచ్చే వరకు ఓపిక పట్టాలని సిఎం సూచించారు. వరంగల్ విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

chitram...
అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన దయాకర్‌ను అభినందిస్తున్న సిఎం కెసిఆర్