తెలంగాణ

లక్ష ఇళ్లు లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజధాని నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రణాళికను తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కో నియోజకవర్గంలో 4740 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించగానే నగరంలో లక్ష ఇళ్లను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఈ ఏడాదే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి పనులను వెంటనే చేపట్టాలని అధికారులను సిఎం ఆదేశించారు. గ్రేటర్ ఎన్నికలకు ముందే నగరంలోని 24 నియోజక వర్గాల్లో ఇళ్ల నిర్మాణ పథకానికి శంకుస్థాపనలు జరిగాయి. అయితే లక్ష ఇళ్లను మంజూరు చేసిన తరువాత పెద్ద సంఖ్యలో పేదలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకోసం రంగారెడ్డి కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి చక్కటి స్థలాలు గుర్తించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం టవర్లను అందంగా నిర్మించాలని, ఈ టవర్లను ఎవరైనా చూస్తే గరీబుల ఇళ్లు కావు, ధనికులవని చెప్పుకునేలా ఉండాలన్నారు. పెద్ద సంఖ్యలో పేదల నుంచి దరఖాస్తులు రావడం అభినందనీయమన్నారు. కులం, మతం అనే బేధం లేకుండా ప్రతి పేదవారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. లబ్దిదారుల ఎంపిక బాధ్యత రెవెన్యూ అధికారులదేనని తెలిపారు. ఇళ్ల స్థలాలను గుర్తించేందుకు స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని సిఎం సూచించారు. 3గత ప్రభుత్వ విధానాలకు, మా ప్రభుత్వ విధానాలకు తేడా ఉంది. పేదలకు లబ్దిచేకూరే విషయంలో రాజకీయాలకు తావివ్వం2 అని సిఎం వ్యాఖ్యానించారు.
లబ్దిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. నగరం నడిబొడ్డునున్న మురికివాడలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేలా ఎక్కడి వారికి అక్కడే అనే విధానంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం జరగాలని సిఎం సూచించారు. ఇటీవల నిర్మించిన ఐడిహెచ్ కాలనీ తరహాలో భవిష్యత్ నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌తో ముఖ్యమంత్రి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై సమీక్షించారు. సమీక్షలో సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ్‌రావు, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి శాంతికుమారి, కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు, స్థలాల సేకరణ గురించి కలెక్టర్ వివరించారు.

చిత్రం... డబుల్ బెడ్‌రూం ఇళ్లపై ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతున్న సిఎం కెసిఆర్