తెలంగాణ

పనె్నండింటిపైనా గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: స్థానిక సంస్థల కోటాకింద శాసన మండలి పనె్నండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం స్థానాలు సాధించేందుకు తెరాస వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. డిసెంబర్ 27న ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకన్నా ముందువచ్చిన స్థానిక సంస్థల ఫలితాల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడం, తెరాస ప్రభుత్వం ఏర్పడటంతో రాజకీయ దృశ్యం మారిపోయింది. కాంగ్రెస్, తెదేపాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున తెరాసలో చేరిపోయారు. వ్యూహాత్మకంగా ముందునుంచే ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మెజారిటీ పెంచుకునేందుకు వీలుగా చేరికలను ప్రోత్సహించినట్టు తెరాస నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే గెలిచిన ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావుతోపాటు వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు తెరాసలో చేరడంతో ఖమ్మంలో తెరాస గెలుపుపై ధీమాగా ఉంది. ఏ జిల్లాలోనూ పోటీ చేసే స్థాయిలో తెదేపా, భాజపాలకు బలం లేదు. అయితే మహబూబ్‌నగర్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలుండగా, ఒకదానిపై ఎలాంటి పోటీలేకుండా గెలుస్తామని తెరాస చెబుతోంది. మహబూబ్‌నగర్‌లో రెండో స్థానం, నల్లగొండలోని ఒక స్థానంలో పోటీ ఉంటుందని, ఈ రెండింటినీ మినహాయిస్తే మిగిలిన ఎక్కడా కాంగ్రెస్ పోటీ ఇవ్వలేదని తెరాస నేతలు చెబుతున్నారు. నల్లగొండలో కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. గట్టి పోటీ ఇవ్వడానికి ఆర్థికంగా సైతం సవాల్ విసిరే పరిస్థితి ఉండడంతో తెరాస అదేస్థాయిలో ఉన్న చిన్నపరెడ్డిని నల్లగొండ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించుకుంది. గతంలో తెదేపాలో ఉన్న చిన్నపరెడ్డిని ఈ వ్యూహంలో భాగంగానే తెరాసలో చేర్చుకున్నారు. ఖమ్మంలో పార్టీలో చేరిన స్థానిక ప్రతినిధులతో గెలుపు సులభమేనని తెరాస అంచనా వేస్తోంది. మొత్తం పది స్థానాలు ఉండగా వీటిలో ఐదు స్థానాల్లో ఏకగ్రీవమేనని, ప్రత్యర్థులకు అభ్యర్థులే లేరని తెరాస అంచనా వేస్తోంది. మహబూబ్‌నగర్, నల్లగొండ తప్ప ఎక్కడా పోటీ ఇచ్చే పరిస్థితి లేదని, ఆ రెండు స్థానాల్లో సైతం పోటీని ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహంతోనే ఉన్నామని కీలక నేతలు చెబుతున్నారు.
అభ్యర్థులు వీరే..
ఆదిలాబాద్ నుంచి లోక భూమారెడ్డి, సతీష్‌ల పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి. నిజామాబాద్‌కు భూపతిరెడ్డి, మెదక్‌కు భూపాల్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కరీంనగర్‌లో భానుప్రసాద్, నారదాసు లక్ష్మణరావు పేర్లు పరిశీలిస్తున్నారు. వరంగల్‌లో పెద్ది సుదర్శన్‌రెడ్డి, కొండా మురళి, రాజయ్య యాదవ్‌ల పేర్లు, నల్లగొండలో చిన్నపరెడ్డి, రంగారెడ్డి జిల్లాలో నరేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజుల పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి.