తెలంగాణ

కన్హయ్యకు నో ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఢిల్లీ జెఎన్‌యు విద్యార్ధి నాయకుడు కన్నయ్య కుమార్‌కు బుధవారం రాత్రి పోలీసులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోకి అనుమతించలేదు. దాంతో పోలీసులతో సిపిఐ నేతలు వాగ్యుద్ధానికి దిగినా ప్రయోజనం లేకపోయింది. ఎవరినీ క్యాంపస్‌లోకి అనుమతించవద్దని వైస్ ఛాన్సలర్ ఇచ్చిన ఆదేశాల మేరకు తాము కన్హయ్య కుమార్‌ను అనుమతించడం లేదని పోలీసులు, వర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది పేర్కొన్నారు. కన్హయ్యకుమార్‌తో వచ్చిన సిపిఐ కేంద్ర కమిటీ సభ్యుడు డాక్టర్ నారాయణ పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. కన్హయ్యకు అనుకూలంగా ఎఐఎస్‌ఎఫ్ విద్యార్థులు, ప్రతికూలంగా ఎబివిపి విద్యార్థుల నినాదాలతో ప్రాంగణం దద్ధరిల్లిపోయింది. తామేమీ చేయలేమని, విసి ఆదేశాలను పాటిస్తున్నామని ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేయడంతో ప్రధాన గేటు వెలుపలే కన్హయ్య కుమార్ విద్యార్థుల నుద్దేశించి మూడు నిమిషాలపాటు మాట్లాడారు. వైస్ ఛాన్సలర్‌గా అప్పారావు బాధ్యతలు స్వీకరించేందుకు రావడంతో మంగళవారం మొదలైన ఉద్రిక్త పరిస్థితి బుధవారం కూడా కొనసాగింది. కన్హయ్య కుమార్ రాకతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ పరిస్థితుల్లో యూనివర్శిటీ యాజమాన్యం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. యూనివర్శిటీలో 26వ తేదీ వరకూ తరగతులను సస్పెండ్ చేసింది. యూనివర్శిటీలోకి మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, బయటి విద్యార్థులు, వేరే విద్యార్థి సంఘాల నాయకులకు సైతం అనుమతి నిరాకరించింది. ఈ మేరకు పోలీసు బలగాలకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. యూనివర్శిటీ మెయిన్ గేట్‌ను మాత్రమే తెరచి కేవలం వర్శిటీకి చెందిన వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నామని కూడా రిజిస్ట్రార్ ప్రకటించారు. మరోవైపు కన్హయ్యకుమార్ సభ నిర్వహించేందుకు విద్యార్ధి సంఘాలు ప్రయత్నించడంతో వ్యవహారం వివాదాస్పదంగా మారింది. యూనివర్శిటీలోకి కన్హయ్యకుమార్‌ను అనుమతించేది లేదని వైస్‌ఛాన్సలర్ అప్పారావు మీడియాకు చెప్పారు. మరోపక్క కన్హయ్య రాకకోసం విద్యార్ధులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. గంటగంటకూ పరిణామాలు మారిపోయి, సాయంత్రానికి మీడియాను సైతం బయటకు పంపించారు. గేటువద్ద తలుపులు మూసేసి యూనివర్శిటీ మెయిన్ గేట్ వద్దనే అందర్నీ నిలిపివేశారు. కొద్ది మంది విద్యార్థులు తమ గుర్తింపుకార్డులు చూపించి లోపలికి వెళ్లారు. మీడియావారి సంఖ్య కూడా పెరగడంతో వారిని అదుపుచేసే క్రమంలో మీడియా ప్రతినిధులను సైతం వర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది తోసివేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాంతో కెమెరాలు కింద పడిపోవడంతో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. మరోపక్క వర్శిటీ లోపలే ఉండిపోయిన విద్యార్థులకు యూనివర్శిటీ మంచినీళ్లు, మెస్‌లు, వైఫై, బ్రాడ్ బ్యాండ్, విద్యుత్ సౌకర్యాలను నిలిపివేసింది. దాంతో విద్యార్ధులు నానా అగచాట్లుపడ్డారు. కొంత మంది రోడ్లమీదనే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. మరికొంత మంది బయటకు వెళ్లి భోజనాలు చేసి వచ్చారు. మంగళవారం దాడులకు పాల్పడిన విద్యార్థులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచేయడంతో వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
కన్హయ్య కుమార్‌ను పోలీసులు అనుమతించకపోవడంతో ఆయన వెనుదిరిగే సమయంలో వేముల రోహిత్ తల్లి రాధిక సెంట్రల్ యూనివర్శిటీ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని తనను క్యాంపస్‌లోకి అనుమతించాలని కోరారు. అయితే పోలీసులు బయటివారెవరినీ లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో రోహిత్ తల్లి మెయిన్ గేట్ వద్దనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తూ దీక్షకు దిగారు. ఇదిలావుంటే, కన్హయ్య కుమార్ వర్శిటీ ప్రాంగణంలోకి వచ్చే ప్రయత్నం చేయలేదని, వస్తానని కూడా అనుమతి అడగలేదని డిసిపి కార్తికేయ వెల్లడించారు. గేటు బయటే విద్యార్థులతో మాట్లాడి కన్హయ్య వెళ్లిపోయారని అన్నారు.