తెలంగాణ

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో నిధులు స్తంభించిపోవడం, ఖర్చులలో సరైన విధానం లేదని కాగ్ ఎత్తిచూపింది. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 2015 మార్చి 31 నాటికి మొత్తం రూ. 33001 కోట్లు ఖర్చయింది. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల తొలి అంచనాలను రూ. 13,356 కోట్ల మేర పెంచారు.
ఈ ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేయక పోవడంతో ఖర్చుపెరగడమే కాకుండా ఆశించిన ప్రయోజనాలు రాష్ట్రానికి చేకూరడంలేదని కాగ్ వ్యాఖ్యానించింది. 2014-15 సంవత్సరానికి కాగ్ నివేదికను శాసనసభకు సమర్పించింది. మొత్తం 109 సాగునీటి ప్రాజెక్టుల అంచనా తొలి వ్యయం రూ. 28,718 కోట్లు, సవరించిన వ్యయం రూ. 42,074 కోట్లు. దీని వల్ల రూ. 13,356 కోట్ల వ్యయం పెరిగింది. గత ఏడాది నాటికి మొత్తం రూ. 33,001 కోట్లను ఖర్చుపెట్టారు. ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్‌ఎల్‌బిసి సొరంగం అంచనా రూ. 3865 కోట్ల నుంచి రూ. రూ. 5811.43 కోట్లకు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రూ. 1550 కోట్ల నుంచి రూ. 2990 కోట్లకు, జెసిఆర్ దేవాదుల ఎల్‌ఐఎస్ రూ. 6,356.02 కోట్ల నుంచి రూ. 9427.73 కోట్లకు, శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ఎల్‌ఐఎస్ రూ.3,177.74 కోట్ల నుంచి రూ. 4,942.57 కోట్లకు పెరిగింది.
రెండు రాష్ట్రాలనుంచి
జీతాలు తీసుకున్న టీచర్లు
రాష్ట్ర విభజన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన ఖమ్మం జిల్లాకు చెందిన వరరామచంద్రపురం, కెఎన్‌పురం, నరసింహాపురం మండలాలకు చెందిన 211మంది ఉపాధ్యాయులు రెండు రాష్ట్రాల నుంచి జీతాలను డ్రా చేసినట్లు కాగ్ పేర్కొంది.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన ఈ టీచర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 1.65 కోట్లు, తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 1.58 కోట్లను డ్రా చేశారు. మోసపూరితంగా డ్రా చేసిన మొత్తాన్ని తిరిగి వసూలు చేసి సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకోవాలని కాగ్ సిఫార్సు చేసింది.
హరిత పన్ను వసూలు
చేయని అధికారులు
రాష్ట్రంలో మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాలోని రవాణా శాఖ అధికారులు 2012 నుంచి 2014 వరకు ఏడు సంవత్సరాలు పూర్తయిన 3337 రవాణా వాహనాలపై , 15 సంవత్సరాలు పూర్తయిన 859 రవాణేతర వాహనాలపై రూ. 10.35 లక్షల మేర హరిత పన్ను వసూలు చేయలేదని కాగ్ పేర్కొంది. రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో , హైదరాబాద్ దక్షిణ మండలం, పశ్చిమమండలం, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల రవాణా శాఖ కార్యాలయాలు 2644 వాహనాల నుంచి రూ.4.23 కోట్ల త్రైమాసిక పన్ను జరిమానాలతో కలిపి మొత్తం రూ.12.68 కోట్లు వసూలు కాలేదని కాగ్ పేర్కొంది.
పెరుగుతున్న డ్రాపవుట్స్
తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో బాలబాలికలు చదువుకోవాలన్న సత్సంకల్పంతో చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. పైగా బడి పిల్లల డ్రాపవుట్స్ పెరుగుతున్నాయి.
ఈ వివరాలను కాగ్ తన నివేదికలో ఎత్తిచూపింది. 2010-15 సంవత్సరాల మధ్య మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న బడుల్లో విద్యార్ధుల నమోదు క్రమంగా తగ్గుతూ వస్తోంది. నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా 12 శాతం విద్యార్ధుల తగ్గుదల నమోదైంది. మధ్యాహ్న భోజన పథకంతో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ దుస్తుల ఉచిత సరఫరా మొదలైన ఇతర పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, విద్యార్ధుళ నమోదు తగ్గుతోందని ప్రభుత్వ అంగీకరించినట్లు కాగ్ పేర్కొంది.