తెలంగాణ

కెనడాలో ఎన్నారై యువతి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 1: కెనడా దేశం టోరంటోలో స్థిర నివాసం ఉంటున్న పాలమూరు పట్టణానికి చెందిన ప్రవాస భారతీయ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. పాలమూరుకు చెంనిన జాన్ కృపావరం, శోభ దంపతులు ఉద్యోగ రీత్యా టోరంటోలో ఉంటున్నారు. వీరి మొదటి కుమార్తె సింథియాజాన్ (24) ఆదివారం తెల్లవారుజామున ఓ శుభకార్యానికి హాజరై ఇంటికి వస్తూ మార్గమధ్యంలో షాపింగ్ చేసేందుకు మాల్‌కు వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. జోసప్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరుపుతుండగా మధ్యలోవున్న సింథియాజాన్‌కు బులెట్లు తగిలాయి. దీంతో జోసప్‌తో పాటు సింథియాజాన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. మృతురాలు సింథియాజాన్ టోరంటోలో లైఫ్ సైన్స్‌లో ఫోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు చేస్తోంది. నలుగురు స్నేహితులతో కలిసి శుభకార్యానికి వెళ్లి వస్తుండంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసుకున్న పాలమూరులోని సింథియాజాన్ బంధువులు, కుటుంబీకులు దిగ్బ్రాంతికి గురయ్యారు. సింథియా మరణవార్తతో క్రిస్టియన్ కాలనీలోని జాన్ కృపావరం ఇళ్లు మూగవోయాయి. సింథియా మృతిపట్ల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దుండగుల కాల్పుల్లో మృతిచెందిన సింథియా (ఫైల్ ఫొటో)