తెలంగాణ

గవర్నర్‌తో సిజె భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్లను నిరసిస్తూ సాగుతోన్న తెలంగాణ న్యాయ పోరాటం కొత్తమలుపు తిరిగింది. హైకోర్టు విభజనపై జరుగుతున్న ఆందోళన అంశంలో చొరవ తీసుకోవడం లేదనే విమర్శలకు తెరదించే ప్రయత్నం గవర్నర్ నుంచి మొదలైంది. 11మంది న్యాయాధికారులు, 9మంది న్యాయ సిబ్బందిని హైకోర్టు సస్పెన్షన్ చేయడం, ఇందిరాపార్కు వద్ద శుక్రవారం న్యాయవాదుల నిర్వహించిన ‘చలో హైదరాబాద్’ ధర్నా నేపథ్యంలో శుక్రవారం రాత్రి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో వేర్వేరుగా సమావేశమై న్యాయవాదుల ఆందోళన, ఇందుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తొలుత గవర్నర్‌తో అడ్వకేట్ జనరల్ సమావేశమైనట్టు సమాచారం. కేంద్రం జోక్యం చేసుకుని న్యాయాధికారుల కేటాయింపు నిబంధనల ప్రకారం చేసినట్టయితే బాగుండేదని ఏజీ సూచించినట్టు తెలిసింది. హైకోర్టు విభజనకు కేంద్రం, సుప్రీం కోర్టు, హైకోర్టు వెంటనే చర్యలు తీసుకుంటే తప్ప న్యాయవాదులు ఆందోళనను విరమించే అవకాశాలు లేవని గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. కాగా న్యాయవాద వర్గాల్లో నెలకొన్న అశాంతి, న్యాయాధికారుల కేటాయింపుపై సిజెతో గవర్నర్ చర్చించినట్టు తెలిసింది.
శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ న్యాయవాదుల మహాధర్నా జరిగింది. ధర్నాలో వేలాదిమంది పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నినాదాలతో ధర్నాచౌక్ దద్దరిల్లింది. మొత్తంమీద న్యాయవాదుల చలో హైదరాబాద్ ఉద్రిక్తతల నడుమ, భారీ పోలీసు బందోబస్తు మధ్య కొనసాగింది. న్యాయాధికారుల ధర్నాకు బిజెపి, తెరాస, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు మద్దతునిచ్చాయి. ధర్నాలో టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీ్ధర్‌బాబు, పి శంకర్‌రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, జి శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాధర్నాను ఉద్దేశించి తెలంగాణ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రత్యేక హైకోర్టు తెలంగాణ సమాజం డిమాండ్ అని, హైకోర్టు విభజన జరిగినప్పుడే సంపూర్ణ తెలంగాణ ఏర్పడినట్టని కోదండరాం అన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ న్యాయవాదుల ఆందోళన సమంజసమేనన్నారు. వెంటనే హైకోర్టును విభజించి, ఆంధ్ర న్యాయాధికారుల ఆప్షన్లను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో స్వల్ప ఉద్రిక్తత
తెలంగాణ న్యాయవాదుల మహాధర్నాలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి లీగల్ సెల్ నేత రవీందర్ మాట్లాడుతుండగా కొందరు న్యాయవాదులు అడ్డుకున్నారు. దాంతో న్యాయవాదుల్లో ఓ వర్గంతో తోపులాట జరిగింది. ఒకదశలో కుర్చీలు లేపి ఒకరిపైనొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. పోలీసుల రంగప్రవేశం చేస్తే మహాధర్నా విఫలమయ్యే అవకాశం ఉన్నందున న్యాయవాదులు ఒకరినొకరు సమర్ధించుకొని శాంతించారు. ఇదిలావుండగా ఇందిరాపార్క్ వద్ద జరిగిన ధర్నాకు కేవలం వెయ్యిమంది పాల్గొనేందుకు అనుమతి ఉండగా, సుమారు ఏడువేల మంది న్యాయవాదులు పాల్గొన్నట్టు న్యాయవాదుల జెఏసి కన్వీనర్ రాజేందర్‌రెడ్డి తెలిపారు.
సిజెను కలసిన ఆంధ్ర న్యాయాధికారులు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయాధికారులు శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబాసాహెబ్ బోస్లేను కలుసుకున్నారు. తెలంగాణ న్యాయవాదుల నుంచి తమకు హానివుందని, కొందరు న్యాయవాదులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు.
విధుల్లో చేరండి: హైకోర్టు
హైకోర్టు విభజన, ఆప్షన్ల రద్దు కోరుతూ ఆందోళనకు దిగిన న్యాయాధికారులు, న్యాయ ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని హైకోర్టు విజ్ఞప్తి చేసింది. చట్టపరంగా సమస్యను పరిష్కరిస్తామని, న్యాయవాదులు విధులకు హాజరుకావాలని హైకోర్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కోరింది.
సుప్రీం సిజెను కలవనున్న టి.అడ్వకేట్లు
తెలంగాణ హైకోర్టు విభజన, ఆంధ్ర న్యాయాధికారుల ఆప్షన్లపై తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ల అసోసియేషన్ ప్రతినిధి బృందం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలవనుంది. చీఫ్ జస్టిస్ తన నివాసంలో ఆదివారం కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ల అసోసియేషన్ అధ్యక్షుడు గండ్ర మోహన్ రావు ప్రకటనలో తెలిపారు. ఈమేరకు తెలంగాణ న్యాయాధికారుల సమస్యలపై వివరించేందుకు ఒక ప్రతినిధి బృందం ఢిల్లీకి బయలుదేరనున్నట్టు మోహన్‌రావు పేర్కొన్నారు.
chitram...
తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం పెద్దఎత్తున నిరసనలకు దిగిన తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారులు