తెలంగాణ

వౌనిక హత్య కేసులో తండ్రే హంతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల, జూలై 4: కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం గోవిందారం గ్రామ పరిసరాల్లో ఆదివారం మోత్కురావుపేట గ్రామానికి చెందిన ఎల్లపల్లి వౌనిక (19) అనే వివాహిత హత్య కేసులో అమె తండ్రి భూమల్ల నడిపి మల్లయ్య హంతకుడని కోరుట్ల సిఐ రాజశేఖర్‌రాజు వెల్లడించారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హంతకుడు, హత్యకు గల కారణాలను ఆయన వెల్లడించారు. వౌనిక తండ్రి మల్లయ్య గల్ఫ్‌లో ఉండగా, ఆమె తల్లి మహేష్ అనే వ్యక్తితో వౌనికకు వివాహం జరిపించింది. వౌనిక తండ్రి మల్లయ్యకు అతి ఇష్టంలేని పెళ్లి కావడం, ప్రస్తుతం కట్నకానుకలు ఇచ్చుకోలేని విషయంపై భార్య, భర్తలు గొడవలు పడ్డారు. ఇంటి కోసం చేసిన అప్పులతోనే కలత చెందుతున్న మల్లయ్య తనకు ఇష్టం లేని పెళ్లితో పాటు అదనంగా మరో నాలుగు లక్షల కట్నం ఎక్కడి నుండి తేవాలని, ఎలాంటి కట్నం లేకుండా వౌనికను తన అక్క కుమారునికి ఇస్తానని మాట ఇచ్చానని తరచుగా భార్యతో గొడవలు పడేవాడు. ఈక్రమంలోనే ఆషాడమాసం ఉందని, తల్లిగారింటి నుండి కుమార్తెను తీసుకువస్తాననంటూ శనివారం రాత్రి వౌనిక వద్దకు వెళ్లాడు. అక్కడి నుండి తన ఇంటికి తీసుకుని వస్తుండగా, దాదాపు 7:30 గంటల సమయంలో గోవిందారం గుట్ట సమీపంలో చీరకొంగుతో కుమార్తెకు ఉరి వేసి హతమార్చాడు. ఇదిలాఉండగా అదేరోజు రాత్రి ఇంటికి చేరిన మల్లయ్య తనపై దాడి చేసి వౌనికను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని రోదిస్తూ గ్రామస్థులతో కలసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసును విచారిస్తుండగా ఆదివారం వనిక మృతదేహం లభ్యమైంది. ఈ హత్య కేసులో తండ్రిపైనే అనుమానిస్తున్నప్పటికీ విచారణలో మల్లయ్య పొంతన లేని విషయాలు చెప్పడంతో మరింత అనుమానించి అదుపులోకి విచారించగా, తమ కుమార్తెను తానే హతమార్చానని చెప్పడంతో మల్లయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ రాజశేఖర్‌రాజు వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో మేడిపల్లి ఎస్సై రవి తదితరులు ఉన్నారు.