తెలంగాణ

పట్టణాల పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో 82 నుంచి 158కి చేరిన సంఖ్య
జనాభాలో మూడింట ఒక వంతు రాజధానిలోనే
జాతీయవృద్ధి కంటే తక్కువ
విద్యారంగంలో ఆశించిన పురోగతి లేదు
10 శాతం మంది వద్దే కంప్యూటర్లు
తెలంగాణ సామాజికాభివృద్ధిపై సర్వే

హైదరాబాద్, మే 8: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పట్టణ ప్రాంతాల వృద్ధి గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో గతంలో 82 పట్టణ ప్రాంతాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 158కి చేరుకుంది. పట్టణీకరణలో అత్యధికంగా 93 శాతం వృద్ధి కనిపించింది. తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థికస్థితిగతులపై కౌన్సిల్ ఫర్ సోషల్ డవలప్‌మెంట్ (సదరన్ రీజియన్ సెంటర్), రాష్ట్ర ప్రణాళిక శాఖ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికను ప్రణాళికశాఖ సోమవారం నిర్వహించింది. ఈ నెల 12న అధికారికంగా సర్వే నివేదికను ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆవిష్కరించనున్నట్టు ప్రణాళిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో 61 శాతం మంది జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండగా 38 శాతం మంది జనాభా పట్టణ ప్రాంతాల్లో నివస్తున్నారు. పట్టణ జనాభా 38 శాతం ఉండగా ఇందులో 30 శాతం మంది జనాభా ఒక్క హైదరాబాద్ నగరంలోనే నివసిస్తున్నట్టు సర్వేలో పేర్కొన్నారు. పది మిలియన్ల జనాభా (కోటి మంది) కలిగిన టాప్ 10 నగరాలలో హైదరాబాద్ ఒకటి కాగా అత్యధిక మురికివాడలు కలిగిన నగరంగా కూడా హైదరాబాద్ నిలిచింది. జనాభా వృద్ధిలో జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణలో వృద్ధి రేటు తక్కువగా ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. 2001-2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ జనాభా వృద్ధి రేటు 17.6 శాతం కాగా రాష్ట్ర జనాభా వృద్ధి రేటు 13.6 శాతంగా నమోదు అయింది. దేశవ్యాప్తంగా 18 సంవత్సరాల వయసు కలిగిన వారిలో 3.7 శాతం మంది వివాహితులు కాగా తెలంగాణలో ఇది 2.6 శాతంగా నమోదు అయింది. హైదరాబాద్ నగరంతో పాటు పట్టణ ప్రాంతం ఎక్కువ కలిగిన రంగారెడ్డి జిల్లాలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారి సంఖ్య అధికంగా ఉండటం మరో విశేషం.
విద్యా రంగంలో ఆశించిన మేరకు పురోగతి కనిపించడం లేదని నివేదికలో పేర్కొన్నారు. విద్యారంగంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యారంగానికంటే ప్రైవేట్ విద్యరంగం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రభుత్వ విద్యనే ప్రత్యామ్నాయంగా ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో ఎస్‌సి విద్యార్థులు మానవీయ శాస్తల్ర వైపు మొగ్గు చూపడం విశేషంగా నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం మంది మాత్రమే కంప్యూటర్లు కలిగి ఉన్నట్టు పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డిలో మాత్రం కంప్యూటర్లు కలిగిన వారు వరుసగా 26 శాతం, 19 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నారు. సాంకేతిక విద్యకు 96 శాతం మంది యువత దూరంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికీ 62 శాతం మంది యువత మాధ్యమిక విద్యకే పరిమితం అయ్యారని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో మహిళ నిరుద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ 2004-05 కంటే మహిళా నిరుద్యోగుల సంఖ్య 2011-12 వరకు తగ్గినట్టు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల మహిళల్లోనే ఎక్కువగా వర్కింగ్ గ్రూప్ ఉన్నట్టు పేర్కొన్నారు. కార్మికులు జాతీయ సగటు కంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు.
వ్యవసాయం, భూ కమతాలు రాష్ట్రంలో గణనీయ పరిణామంలో ఉపాధి, ఆహార భద్రతను కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. 2015-16లో ఓబిసిలు, ఎస్‌సి, ఎస్‌టీలు గణనీయమైన గ్రామీణ జనాభా 12.9 శాతం మేర వ్యవసాయంపై ఆధారపడి ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ సంక్షోభం రైతుల ఆత్మహత్యలకు దారితీస్తుందని, దీనిని తొలగించేందుకు తక్షణ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సర్వేలో పేర్కొన్నారు. భూములు లేని రైతులు ఎంత మంది ఉన్నారు? భూ లభ్యత ఎంత? కౌల్ పరిస్థితి ఎంత? తదితర అంశాలపై దృష్టి సారించాల్సిర అవసరం ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం జనాభాలో భూమి లేని వారి సంఖ్య 2002-12 మధ్య 43.3 శాతం ఉందని పేర్కొన్నారు. చాలా మంది ఉన్న భూములు ఒక హెక్టార్ కంటే తక్కేవనని స్పష్టం చేసింది. ఎస్‌సీల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపింది. మిగతా వాటితో పొలిస్తే పంటల విస్తృతి కూడా తక్కువేనని పేర్కొన్నారు. నీటిపారుదల సౌకర్యం కూడా అంతంత మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రాధాన్యతను, దీనిని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించింది. పక్క గృహాల అంశంలో జాతీయ సగటు కంటే రాష్ట్రం కాస్త మెరుగుగానే ఉందని పేర్కొన్నారు.