తెలంగాణ

బోరుబావిలో బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 29: ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన రాకేష్‌ను రక్షించేందుకు అధికార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మూడేళ్ల చిన్నారనికి బోరుబావి మింగేసింది. 24 గంటలపాటు శ్రమించిన అధికారులు చిట్టచివరకు రాకేష్ మృతదేహానే్న వెలికితీశారు. ఆదివారం ఉదయం 6.30కు మృతదేహాన్ని బోరు మోటారును పైకితీసిన విధానంలోనే తీశారు. బయటకు తీసిన బాలుడి మృతదేహాన్ని 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం తండ్రి సాయిలుకు అప్పగించారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి నాలుగు జెసిబిలు, మూడు ఇటాచీలతో బోరుబావి చుట్టూ తవ్వినా పెద్దపెద్ద బండరాళ్లు అడ్డంకిగా మారాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం చేసిన ప్రయత్నాలూ ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. నల్గొండ జిల్లాకు చెందిన కరుణాకర్, ఉస్మాన్, రవి, సతీష్‌లతోపాటు సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌లు చాకచక్యతను ప్రదర్శించి బాలుడిని బయటకులాగారు. వీరి వద్ద ఉన్న పరికరాలు, ల్యాప్‌ట్యాప్, సిసి కెమెరాల సహాయంతో బాలుడు రాకేష్‌ను బయటకు తీసేందుకు రెండు గంటలపాటు శ్రమించారు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు నిరంతరాయంగా ప్రాణవాయువు అందించినా ప్రయోజనం లేకపోయింది. ప్రాణాలతో బాలుడు బయటపడతాడని కుటుంబీకులు, గ్రామస్తులు పెట్టుకున్న ఆశలు నిరాశగా మారాయి. తాము దగ్గర్లో ఉండివుంటే బాలుడిని సురక్షితంగా వెలుపలికి తీసే వారమని, మీడియా చానళ్లలో వచ్చిన స్క్రోలింగ్‌ల ద్వారా సమాచారం తెలుసుకుని ఇక్కడికి చేరుకున్నామని నల్గొండకు చెందిన వారు పేర్కొన్నారు. సంగారెడ్డిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బాలుడి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. బోరును తవ్విన అనంతరం పూడ్చివేయకుండా నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన భూమి యజమాని, బోరు మోటారు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చిత్రం... బోరుబావి నుంచి రాకేష్‌ను బయటకు తీసి ఆంబులెన్స్‌లోకి తరలిస్తున్న పోలీసులు