తెలంగాణ

మరో ముగ్గురు రైతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/మహబూబ్‌నగర్/సంగారెడ్డి/ నిజామాబాద్, నవంబర్ 29: పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేని నిస్సహాయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతునే ఉన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఆదివారం ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోగా ఒకరు గుండెపోటుతో మరణించారు. మహబూబ్ నగర్ జిల్లా కొందుర్గు మండల పరిధిలోని పెద్దఎల్కిచర్ల గ్రామానికి చెందిన గట్టుపల్లి భీమయ్య (50) అనే రైతు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొన్నాడు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సల్కునూరు గ్రామంలో బారి శివలింగం (50) అనే కౌలు రైతు పత్తిచేను వద్దే గుండెపోటు రావడంతో మృతిచెందాడు. మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలం ఖలీల్‌పూర్‌కు చెందిన రైతు అప్పుల బాధలు భరించలేక ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. నిజామాబాద్ జిల్లా లింగంపేట్ మండలంలోని సజ్జన్‌పల్లి గ్రామానికి చెందిన ముగురు పోచయ్య (50) అనే రైతు అప్పులు తీర్చే దారిలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు.