తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘునాథపల్లి, నవంబర్ 29: ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్థనగిరి వద్ద వరంగల్-హైద్రాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వరంగల్ మట్టెవాడకు చెందిన బారెడు ప్రభాకర్ (52) కుటుంబసభ్యులతో కలిసి నల్గొండ జిల్లా భువనగిరిలో జరిగిన శుభాకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. వరంగల్ మట్టెవాడ వివేక్ వాచ్‌కో యజమాని ప్రభాకర్ శుభకార్యానికి వెళ్లి తిరిగి వరంగల్‌కు కారులో వస్తున్న క్రమంలో రఘునాథపల్లి మండలం గోవర్థనగిరి బస్టాండ్ వద్ద హన్మకొండ వైపు ప్రభాకర్ కారుకన్నా ముందు వెళ్తున్న నిసాన్ కారు టైరులో గాలి తక్కువ ఉండడంతో కారుటైరును గమనిస్తూ నెమ్మదిగా వెళ్తుండడంతో దాని వెనకాలే వేగంగా వస్తున్న ప్రభాకర్ కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కారు వెనుకభాగాన్ని ఢీకొని కంగారులో కుడివైపునకు వెళ్లగా హన్మకొండ నుండి హైద్రాబాద్ వైపు వెళ్తున్న వరంగల్ డిపోకు చెందిన ఎపి 36 జడ్ 0276 నెంబర్ గల ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును ఎదురుగా ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జైంది. ఘటనలో కారు డ్రైవర్ ప్రభాకర్ అక్కడికక్కడే మృతిచెందగా కారు ముందు సీట్లో కూర్చున్న విజయ (47) కారు ముందు భాగంలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించింది. కారులో ఇరుకున్న విజయను, కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మహిళలను 108 ద్వారా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా విజయతో పాటు పద్మావతి (60) చికిత్స పొందుతూ మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన బేబిప్రియను ప్రథమ చికిత్స అనంతరం ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇద్దరు చిన్నారులు.. మృత్యుంజయులు
బస్సు, కారు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బింద్ర (6), బిట్టు (4) అనే ఇద్దరు చిన్నారులు స్వల్వగాయాలతో బయటపడి మృత్యుంజయులుగా నిలిచారు. జీడికల్ దేవాలయంలో కార్తీకమాసం సందర్భంగా ఆదివారం జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరై తిరిగి హన్మకొండకు వెళ్తున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను గోవర్థనగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కలిచివేసింది. రోడ్డు ప్రమాదంలో మృత్యుంజయులైన ఇద్దరు చిన్నారులను ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై రంజిత్‌రావు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకున్నారు.

కారు, బస్సు ఢీకొన్న దృశ్యం