తెలంగాణ

నేనూ.. నా కుటుంబం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన ‘నేను నా కుటుంబం..నా పరివారం’ అన్న చందాన ఉందని టిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులతో రోజంతా సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టిడిపి, ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలోకి ఆకర్షించేందుకు గాను నిధులు ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన టిడిపి మున్సిపల్ చైర్మన్‌ను టిఆర్‌ఎస్‌లో చేరేటప్పుడు ప్రజా తీర్పును గౌరవించడం ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. వారు ప్రజల తీర్పుకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం లేదా అని అన్నారు. అధికార పార్టీలో చేరితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని, ఇతర పార్టీలకు చెందిన నేతలు అధికార పార్టీలో చేరాలని కెసిఆర్ పిలుపునిస్తున్నారని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. 17 నెలల కిందట అసెంబ్లీ సాక్షిగా సుల్తాన్‌బజార్, అసెంబ్లీ ముందు మెట్రో అలైన్‌మెంట్ మారుస్తామని ప్రకటించి సుల్తాన్‌బజార్ వ్యాపారులతో పాలాభిషేకాలు చేయించుకున్న కెసిఆర్ ఇప్పుడు మళ్లీ అదే మార్గంలో పనులు చేపట్టాలని ఆదేశించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మాట తప్పిన కెసిఆర్ సుల్తాన్ బజార్ వ్యాపారులకు ఏం సమాధానం చెబుతారని అన్నారు. రైతుల ఆత్మహత్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తే, రైతుల ఆత్మహత్యలకు పెళ్లిళ్లు, చదువులే కారణమని చెప్పడం వారిని అవమానించడమేనని అన్నారు.