తెలంగాణ

ఎఎస్‌ఐ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 20: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న, పోలీస్ శాఖను కుదిపేస్తున్న ఎఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఉదంతంలో సిఐడి, పోలీస్, ఎసిబి, ఐటి శాఖలు చతుర్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. ఓ వైపు సిఐడి అధికారులు వ్యూహాత్మకంగా దూసుకెళ్తూ మోహన్‌రెడ్డి అక్రమ దందాపై పూర్తి వివరాలను సేకరిస్తూ, బినామీలను అరెస్ట్ చేస్తుండగా, మరోవైపు జిల్లాలోని పలు ఠాణాల్లో బాధితుల ఫిర్యాదుల మేరకు ఎఎస్‌ఐపై ఆయా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇంకోవైపు అవినీతి నిరోధక, ఆదాయ శాఖలు సైతం దృష్టి సారించాయి. ఇప్పటికే రోజుకో మలుపు తిరుగుతున్న ఎఎస్‌ఐ ఉదంతంలో ఇంకేన్ని మలుపులు తిరగనుందో, ఇంకేంత మంది పేర్లు వెలుగుచూస్తాయో అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సిఐడి అధికారులు తాజాగా శుక్రవారం ఓకేరోజు ఆరుగురిని కోర్టులో హజరుపరిచారు. సింగిరెడ్డి కరుణాకర్‌రెడ్డి (40), సింగిరెడ్డి జితేందర్‌రెడ్డి (41), సిఐడి కానిస్టేబుల్ పరుశురాంగౌడ్ (47), సర్దార్ పర్మిందర్‌సింగ్ అలియాస్ పంకజ్ (28), ఇట్టిరెడ్డి శ్రీపాల్‌రెడ్డి (36), కత్తి రమేష్ (28) అనే ఆరుగురిని కోర్టులో హాజరుపర్చారు. వీరితో ఇప్పటివరకు 8మందిని కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు సిఐడి అధికారులు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్లి మోహన్‌రెడ్డి, ఆయన బినామీలపై జరిగిన రిజిస్ట్రేషన్లపై తనిఖీ చేశారు. కాగా, ఎఎస్‌ఐ అకౌంటెంట్ జ్ఞానేశ్వర్ సిఐడి అదుపులో ఉన్నట్లు, ఆయన అందరి చిట్టాలు విప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా, మోహన్‌రెడ్డి బాధితులు ఎక్కువవుతూ వారు ఠాణాల్లో ఫిర్యాదులు చేస్తుండటంతో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 25వరకు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఎసిబి అధికారులు సైతం దృష్టి సారించారు. మోహన్‌రెడ్డికి సంబంధించిన కేసు సర్టిఫైడ్ కాగితాలు ఇవ్వాలని కోర్టులో ఎసిబి పిటిషన్ దాఖలు చేసింది. అలాగే అక్రమ దందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు, బినామీలను పిలిపించి విచారిస్తున్నారు. బాధితుల నుంచి కూడా వివరాలను సేకరిస్తున్నారు. ఈ విషయాన్ని ఎసిబి డిఎస్పీ సుదర్శన్‌గౌడ్ ధ్రువీకరించారు. ఈ శాఖలకు తోడు ఆదాయ శాఖ అధికారులు సైతం ఎఎస్‌ఐ ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు, బినామీలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, మోహన్‌రెడ్డి ఫైనాన్స్ దందాలో రాయలసీమ గుండాలు కొందరు పెట్టుబడులు పెట్టినట్లు, ముఖ్యంగా ‘సూరి’ హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ రూ.40కోట్లు పెట్టుబడులు పెట్టినట్లుగా జిల్లాలో ప్రచారం కొనసాగుతుండగా, దీనిని ఎవరు ధ్రువీకరించడం లేదు.