తెలంగాణ

బోరుబావులపై సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29:ఉపయోగంలో లేని బోరు బావులను మూసివేయాలని, ఉపయోగపడే బోరుబావుల చుట్టూ ఫెన్సింగ్ వేయాలని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బోరుబావులన్నింటిపై సర్వే నిర్వహించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఉపయోగంలో లేని బోరుబావుల పూడ్చివేత, ఉపయోగించే వాటి చుట్టూ పెన్సింగ్ వేయాలని చెప్పారు. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెం తండాలో బోరుబావిలో పడి బాలుడు చనిపోవడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని, పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై పంచాయితీరాజ్ కమీషనర్ అనితా రామచంద్రన్, ఆర్‌డబ్ల్యుయస్ ఇఎన్‌సి సురేందర్‌రెడ్డిలతో కెటిఆర్ ఆదివారం సమీక్ష జరిపారు. గ్రామాల్లోని బోరుబావులతో పాటు పంట పొలాల్లోని బోరుబావుల పూడ్చివేత బాధ్యత గ్రామ సర్పంచులతో పాటు గ్రామ కార్యదర్శులు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ అంశంపై ఆర్‌డబ్ల్యుయస్ శాఖ తరఫున జిల్లా ఎస్‌ఇ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు స్పష్టమైన మార్గదర్శకాలతో సర్క్యూలర్ జారీ చేయాలని కెటిఆర్ ఆదేశించారు. తమ శాఖ తరఫున గతంలో ఆదేశాలు ఇచ్చామని, ఇలాంటి ఘటనలు జరగకుండా పని చేయని బోర్‌వెల్స్ మూసివేయాలని సూచించినట్టు అధికారులు తెలిపారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులకు క్యాప్‌లు బిగించి, చుట్టూ పెన్సింగ్ వేయాలని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు సర్క్యులర్ జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.