తెలంగాణ

డ్రైవర్ ఆత్మహత్యకు ఉబర్ సంస్థదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: ఉబర్ క్యాబ్ సంస్థలో పని చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ మహ్మద్ జహీరుద్దీన్ ఆత్మహత్య కేసులో జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి హామీ ఇచ్చారు. ఉమర్ క్యాబ్ సంస్థ జహీరుద్దీన్ ఆత్మహత్యకు బాధ్యత వహించాలని వారు మంత్రుల దృష్టికి తెచ్చారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ క్యాబ్స్, బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కలిసి వినతి పత్రం అందించారు. ఈ నెల 17న అంబర్‌పేట ప్రాంతంలోని గోల్నాకలోని తన నివాసంలో జహీరుద్దీన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇది సాధారణ ఆత్మహత్య కాదని, ఉబర్ మేనేజ్‌మెంట్ దీనికి బాధ్యత వహించాలని మంత్రికి తెలిపారు. హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని మంత్రుల క్వార్టర్స్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.