తెలంగాణ

చైనా మాంజాపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: పక్షులు, జంతువులు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న చైనా మాంజాను నిషేధిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫైలుపై అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్న సంతకం చేశారు. దీంతో అటవీ, పర్యవరణ శాఖల కార్యదర్శి వికాస్‌రాజ్ బుధవారం జివో నంబర్ 2 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. చైనా మాంజాను ఉపయోగించి పతంగులను ఎగుర వేయడం వల్ల పక్షులు, జంతువులు, మనుషుల ప్రాణాలకు ప్రమాదంగా మారినందున పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 సెక్షన్ ఐదు ప్రకారం నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైనా మాంజా కొనుగోలు చేయడం, నిల్వ ఉంచడం, విక్రయించడం, వినియోగించడంపై ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. అటవీ, పర్యావరణ, బయోడైవర్సిటీ శాఖలతో పాటు ఇతర శాఖలు తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. నైలాన్ రంతో కూడి ఉండటం, గాజు పెంకుల పొడితో మాంజా తయారు చేయడంతో చైనా మాంజా ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. చైనా మాంజా వల్ల కలుగుతున్న ప్రమాదాన్ని పలు విభాగాలు, సంస్థలు మంత్రి జోగు రామన్న దృష్టికి తీసుకుని రాగా, విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. నివేదిక అందగానే మంత్రి జోగు రామన్న చైనా మాంజాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.