తెలంగాణ

కొత్తగా శ్రీరామ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ రెండు ప్రాజెక్టులను కలిపి శ్రీరామ సాగునీటి ప్రాజెక్టుగా రీ-డిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా రూపకల్పన చేయనున్న శ్రీరామ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి రూ. 7,900 కోట్లకు ప్రభుత్వం ఆమోదించింది. సచివాలయంలో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌లను కలిపి రీ-డిజైన్ చేయనున్న ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో ఉండటంతో దానికి ఆ జిల్లాలోని భద్రాచలం శ్రీరామచంద్రుని నామకరణం చేయడానికి కూడా మంత్రిమండలి ఆమోదించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు మీడియాకు వెల్లడించారు. కొత్తగా నిర్మించబోయే శ్రీరామ సాగునీటి ప్రాజెక్టు రూపకల్పనను వ్యాప్కోస్‌కు అప్పగించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ రెండు ప్రాజెక్టుల ఆయకట్టుతో పాటు ఖమ్మం జిల్లాలోని వ్యవసాయ యోగ్యమైన భూమికంతటికీ కొత్తగా నిర్మించబోయే శ్రీరామ సాగునీటి ప్రాజెక్టు ద్వారా నీరు అందించే విధంగా డిజైన్ చేస్తున్నామని మంత్రులు వెల్లడించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను ముందుగా అనుకున్నట్టు ఈ నెలలో కాకుండా వచ్చే నెల మార్చిలోనే నిర్వహించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. మూసా పద్ధతిలో కాకుండా వాస్తవ పరిస్థితికి అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. వారం రోజులలో అన్ని శాఖలు తమ బడ్జెట్ అంచనాలను రూపొందించి సమర్పించాలని, ఆ తర్వాత శాఖల వారీగా ముఖ్యమంత్రి సమీక్షిస్తారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిందిగా మంత్రి మండలి ఆధికారులను ఆదేశించింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపొందించిన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకోవడానికి మంత్రిమండలి ఆమోదించింది. విజయ డైరీ పాలకు లీటర్‌కు ఇప్పటికే నాలుగు రూపాయల ధర పెంచిన విధంగానే ఇతర పాల ఉత్పత్తులకు కూడా ధర పెంచే అంశంపై అధ్యయనం చేయడానికి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ ఉప సంఘంలో మంత్రులు ఈటెల రాజేందర్‌రెడ్డి, జి జగదీశ్‌రెడ్డితో పాటు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి సభ్యులుగా ఉంటారని హరీశ్‌రావు వివరించారు. అలాగే తెలుగు చలన చిత్రపరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో సభ్యులుగా మంత్రులు కె తారకరామారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు సభ్యులుగా ఉంటారని మంత్రి హరీశ్‌రావు వివరించారు.
హార్టికల్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను హార్టికల్చర్ కార్పొరేషన్ ద్వారా వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసి వాటిలోనే పండించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం కూరగాయలు, పండ్లు అన్ని కూడా నాణ్యత లేకుండా నాసిరకంగా పండించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయని మంత్రి తెలిపారు. వీటిని ప్రభుత్వమే ఉత్పత్తి చేయడం వల్ల కల్తీ జరిగే ఆస్కారం ఉండదని కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 3 కోట్ల 75 లక్షల మంది ప్రజలకు 67 లక్షల 83 వేల టన్నుల కూరగాయలు అవసరం కాగా, ప్రస్తుతం కేవలం 6 లక్ష 65 వేల టన్నుల ఉత్పత్తులను మాత్రమే పండిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం నాలుగు లక్షల హెక్టార్లలో పండిస్తున్న కూరగాయల విస్థీర్ణాన్ని 10 లక్షల హెక్టార్లకు విస్తరించబోతున్నట్టు మంత్రి పోచారం వివరించారు.
chitram...
1. కేబినెట్ భేటీలో పాల్గొనేందుకు సచివాలయానికి చేరుకున్న
మంత్రులు కెటిఆర్, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ తదితరులు