తెలంగాణ

తెలంగాణలో వైకాపాకు మరో షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: తెలంగాణలో వైకాపా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎంపీ పొంగులేటి తన అనుచరులు, వైకాపా కార్యకర్తలతో సోమవారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే ఆయన తన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. పొంగులేటి,పాయం తెరాసలో చేరితే తెలంగాణలో వైకాపా దాదాపు ఖాళీ అయినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కెటిఆర్ ఈరోజు ఎంపీ పొంగులేటి ఇంటికి వెళతారని, ఆ తర్వాత జరిగే మీడియా సమావేశంలో పొంగులేటి తన అభిప్రాయాలను వెల్లడిస్తారని సమాచారం.