చిత్ర

తలలో నాలుకలా...

  • 22/02/2012

ఒకేఒక చిత్రంతో స్టార్‌గా ఎదిగిన నిత్యామీనన్ నిత్యం నలుగురు నోళ్ళల్లో నానడానికే ఇష్టపడుతోంది. అది చెడు మాటలైనా, మంచి మాటలైనా ఏదో విధంగా నలుగురికీ తన పేరు వినబడుతోందని సంతోషపడుతోంది. ఇప్పటికే తెలుగు చిత్రాలలో అవకాశాలు లేకుండా పోయినా కనీసం మలయాళంలో అవకాశాలు బాగా వున్నాయి. బ్యాచిలర్ పార్టీ, ఉస్తాద్ హోటల్ ప్రస్తుతం ఆమె చేతిలో వున్న పెద్ద ప్రాజెక్టులు. అయితే నిత్యా నిర్మాతలను ఇబ్బంది పెడుతోందని నిర్మాతల మండలికి ఫిర్యాదుచేశారు. ఆమె చిత్రాలను విడుదల కానివ్వమని వారు భీష్మించుకు కూర్చున్నారు. ఎడిటర్స్ గిల్డ్, యాక్టర్స్ అసోసియేషన్‌వారు మాత్రం నిత్యాకే సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య రోజురోజుకి మాటల యుద్ధం పెరిగిపోతోంది. దీంతో నిత్య నలుగురి నోళ్లలో నానడం తప్పనిసరైంది. ఇప్పటికైనా ఒదిగిపోయే తత్వం అలవరచుకుని, నలుగురి నోళ్లల్లో నాలుకలా వుండాలని సన్నిహితులు చెబుతున్నారట. చివరికి ఏం చేస్తుందో ఏమో!

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading