తెలంగాణ

వర్సిటీల్లో ఘటనలపై టి.అసెంబ్లీలో వేడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హెచ్‌సియు, ఉస్మానియా వర్సిటీల్లో ఇటీవలి ఘటనలపై తెలంగాణ అసెంబ్లీలో వేడిగా, వాడిగా శనివారం చర్చ జరిగింది. ఈ అంశంపై చర్చ జరపాలని పలువురు సభ్యులు డిమాండ్ చేయడంతో సభ పలుసార్లు వాయిదా పడింది. వర్సిటీల్లో ఘటనలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం కెసిఆర్ ప్రకటించారు. హోం శాఖ పద్దులపై చర్చించకుండా, హెచ్‌సియు ఘటనపై చర్చించాలని పట్టుబట్టడం సరికాదని ఆయన అన్నారు. హెచ్‌సియు వైస్ చాన్సలర్ అప్పారావును పదవి నుంచి తప్పించాలని విపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఉస్మానియా వర్సిటీలో ఓ విద్యార్థి మృతిపై ఇప్పటికే విచారణ జరుగుతోందని హోం మంత్రి నాయని నరసింహారెడ్డి తెలిపారు. హెచ్‌సియులో పరిణామాలతో దేశం పరువు పోయిందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించగా, రాహుల్ గాంధీ రెండుసార్లు రావడం వల్ల హెచ్‌సియులో వివాదాలకు ఆజ్యం పోసినట్లయ్యిందని బిజెపి ఎమ్మెల్యే ప్రభాకర్ విమర్శించారు.