తెలంగాణ

సకల జీవాలకు చెట్లే జీవనాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 27: పచ్చని చెట్లు నేల తల్లికి వస్త్రాలని, ఏ భూమిపై నివసించే సకల జీవాలకు చెట్లే జీవనాధారమని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ లిమిటెడ్ (టీఎస్‌పీహెచ్‌సీ) చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ లైన్స్‌లో శుక్రవారం జరిగిన హరితహారం కార్యక్రమంలో చైర్మన్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, అదనపుడీజీపీ డాక్టర్ జితేందర్ (శాంతి భద్రతలు), నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దామోదర్ మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రకృతి మాత దీవెనలు పొందిచడమేనని చెట్లుంటేనే మంచి గాలి, వర్షాలు విస్తారంగా కురుస్తాయని, కాలుష్యం లేని వాతావరణం మనకు లభిస్తాయని, చెట్లు లేని నెల ఎడారిగా మారుతుందని అది మానవ వినాశనానికి మూల కారణం అవుతుందన్నారు. చెట్లను పెంచడం ఎంత ముఖ్యమో, ఉన్న చెట్లను పరిరక్షించుకోవడం అంతే ముఖ్యమని, పచ్చని చెట్లను నరకడం మహా పాపమని, అప్పట్లో పెద్దలు చెట్లను ప్రాణౌసమానంగా చూసుకున్నారు. చెట్లను కొన్ని సందర్భాల్లో దేవతలుగా పూజించడం జరిగిందని చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలొ హరితహారం కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికపై చేపట్టారని, ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరు చెట్లను నాటే కార్యక్రమాన్ని, తెలంగాణ తల్లికి హరితహారాన్ని ఏర్పాటు చేయాలని దామోదర్ అన్నారు. ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ రూపొందించిన ‘గ్రీన్ ఛాలెంజ్’ మంచి ప్రాచుర్యం పొందిందని తెలిపారు.
ఈ సంవత్సరం తన నుంచి అటవీ, దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే.జోషి, సినీతార, మాజీ ఎమ్మెల్యే జయసుధ, ప్రముఖ సినీ నటులు, దర్శకులు, రచయిత తనికెళ్ళ భరణి తదితరులు ‘గ్రీన్ ఛాలెంజ్’ స్వీకరించారని, గతంలో భారత ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు గ్రీన్ చాలేంజ్‌లో పాల్గొన్నట్లు దామోదర్ తెలిపారు. బేగంపేట్ పోలీస్‌లేన్స్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి, అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) జీతేందర్, తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ. మల్లారెడ్డి తోపాటు సీనియర్ ఐపీఎస్ అధికారిణీలు స్వాతి లక్రా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.