తెలంగాణ

రేపు తెలంగాణ టెట్ నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ టీచర్సు ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)ను ఏప్రిల్ 9న నిర్వహించనున్నట్టు పాఠశాల విద్య సంచాలకుడు జి కిషన్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను 29న జారీ చేస్తామని, ఆన్‌లైన్‌లో అభ్యర్థులు ఆరోజు నుంచే నోటిఫికేషన్ ఇతర వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. పరీక్ష ఫీజు అదే రోజు నుండి మార్చి 14వరకూ చెల్లించవచ్చన్నారు. దరఖాస్తులను మార్చి 1నుండి మార్చి 15 వరకూ సమర్పించవచ్చన్నారు. అభ్యర్థులకు పరీక్షకు సంబంధించి ఎలాంటి అనుమానాలున్నా ఫిబ్రవరి 29 నుండి ఏప్రిల్ 9 వరకూ నివృత్తి చేసేందుకు కౌంటర్లు పనిచేస్తాయన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ఏమైనా సమస్యలుంటే మార్చి 14లోగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. హాల్‌టిక్కెట్లు మార్చి 30నుండి జారీ చేస్తామని, పరీక్ష ఏప్రిల్ 9 ఉదయం 9.30నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకూ పేపర్-2 జరుగుతుందని చెప్పారు. ఫలితాలను ఏప్రిల్ 23న ప్రకటిస్తామన్నారు. దీంతోపాటు అభ్యర్థులు డి.ఎస్సీకి సన్నద్ధం కావాలని సూచించారు.