అంతర్జాతీయం

టెస్ట్‌ట్యూబ్ కుక్క పిల్లలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా శాస్తవ్రేత్తల ఘనత
వాషింగ్టన్, డిసెంబర్ 10: ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికాలో శాస్తవ్రేత్తలు టెస్ట్ ట్యూబ్ ద్వారా కుక్క పిల్లలను సృష్టించారు. కుక్కల్లో, మానవుల్లో వారసత్వంగా సంక్రమించే వ్యాధులను నిర్మూలించడానికి ఇది దోహదపడుతుందని శాస్తజ్ఞ్రులు చెప్పారు. కుక్కల జన్యు కణాలనుంచి వారసత్వంగా వచ్చే వ్యాధులకు సంబంధించిన వాటిని తొలగించి సురక్షితమైన వాటిని సేకరించి కృత్రిమ గర్భధారణ ద్వారా కుక్క పిల్లలను సృష్టించవచ్చని వారు పేర్కొన్నారు. ఐవిఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో ఇదో ముందడుగు అని వారు తెలిపారు. కుక్క జాతికి చెందిన జంతువుల్లో 350కి పైగా సామీప్యమున్న వారసత్వంగా సంక్రమించే వ్యాధులు ఉన్నాయని చెప్పారు. ఒక ఆడ కుక్క గర్భంలోకి 19 పిండాలను ప్రవేశపెట్టగా అది ఏడు ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చిందని వారు వివరించారు. 1970వ దశకం మధ్య కాలం నుంచి శాస్తజ్ఞ్రులు టెస్ట్ ట్యూబ్ పద్ధతి ద్వారా కుక్క పిల్లలను సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ విజయవంతం కాలేదు.