తెలంగాణ

నిజామాబాద్‌కు మరో 11వందల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మరో 11వందల ఇళ్లు అదనంగా కేటాయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. జగిత్యాల నియోజకవర్గంలో త్వరలోనే పర్యటించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నిజామాబాద్ ఎంపి కవిత, నిజామాబాద్ ఎమ్మెల్యే బి గణేష్ గుప్తా, జగిత్యాల టిఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ డాక్టర్ సంజయ్ సచివాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను శుక్రవారం కలిశారు. అదనపు ఇళ్లతోపాటు వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటికే కేటాయించిన 400 ఇళ్లకు తోడుగా ముఖ్యమంత్రి కోటా నుంచి 1100 ఇళ్లను కేటాయిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. నిజామాబాద్ పట్టణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి కూడా నిధులు విడుదల చేయనున్నట్టు చెప్పారు.