తెలంగాణ

చండీయాగం..ఏర్పాట్లు వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 25: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాధించడానికి రాజీలేని పోరాటం చేసిన గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆరాటపడుతూ ఆయుత చండీయాగానికి శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వేలాది మంది రుత్విక్‌లతో ఆయుత చండీయాగాన్ని నిర్వహించనున్నారు. యేడాది క్రితమే ఈ యాగం నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణకే తలమానికమైన ఏడుపాయల వనదుర్గ మందిర ప్రాంతంలో క్రతువు చేపట్టాలని మొదట ఆయన సంకల్పించారు. అందుకు సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వ ముఖ్య సలహాదారు కెవి రమణాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించారు. ఐదు రోజుల కార్యక్రమం కనుక భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకున్న సిఎం కెసిఆర్ జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఆయుత చండీయాగం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన 20 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి చదును చేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. ఆయుత చండీయాగాన్ని 5, 7, 9, 11 ఇలా రుత్విక్‌ల అనుకూలతను బట్టి నిర్వహిస్తారు. మొత్తం 700 శ్లోకాలను పదివేలసార్లు జపిస్తే ఆయుత చండీయాగం పూర్తవుతుం ది. మధ్యలో వెయ్యిసార్లు రుద్రం, 130 మంత్రాలతో కూడిన అరుణ పారాయణం చేస్తే ఆయురారోగ్యం సిద్ధిస్తుంది. గో సేవ, రుషిపూజ, గుడిపూజ, యదీశ్వరుల పూజ, అన్నదానం, వస్తద్రానం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆరు మాసాల క్రితం హైదరాబాద్‌లోని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానందస్వామి ఆయుత చండీయాగాన్ని నిర్వహించగా సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామం లో ఉన్న పురాతన భవాని మందిరం ప్రాంగణంలో కూడా ఆయుత చండీయాగాన్ని నిర్వహించారు.
సాధారణంగా ఇలాంటి యాగాలను లోక కల్యాణార్థం చేపట్టడం స హజం. పెద్దమొత్తం ఖర్చుతో కూడిన కార్యక్రమాన్ని నాటి నుంచి నేటివరకు పాలకులకే సాధ్యమైంది. రాష్ట్ర సాధన అనంతరం నెలకొన్న ప్రకృతి వైపరీత్యాలతో దుర్భిక్ష వాతావరణం ఆవహించి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, తాగడానికి మంచినీరు లభించని దైన్యస్థితి నెలకొంది. విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలను సుభిక్షం దిశగా తీసుకురావాలన్న సంకల్పంతో సిఎం కెసిఆర్ ఆయుత చండీయాగం చేపట్టేందుకు సాహసించడం పాలన దక్షతకు దర్పం పడుతుందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకాలంలో ప్రజల కలను సాకారం చేయాలని కోరుతూ కొండపాక మండలం మర్పడగ గ్రామంలో ఉన్న సంతాన మల్లికార్జునస్వామి, విజయదుర్గా దే వాలయాల ప్రాంగణంలో 2006 మార్చి 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించారు. తనకు దేవుడిపై అపారమైన విశ్వాసం ఉందని సంక ల్ప బలంతో రాష్ట్ర పాలన కోసం దేనికైనా వెనుకాడబోనని కెసిఆర్ ప్రకటించి విమర్శకులకు దీటైన సమాధా నం ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆయుత చండీయాగానికి అవసరమైన రుత్విక్‌లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉత్తర భారతదేశం నుంచి రప్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఒకరోజు యాగంలో పాల్గొన్న రుత్విక్ మరుసటి రోజున పాల్గొనకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో పాల్గొనే రుత్విక్ ఒక్కంటికి 2500 రూపాయల నగదు, పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు సమాచారం.