తెలంగాణ

సహకార సంఘాలకు పర్సన్-ఇన్‌చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణ రాష్ట్రంలో వివిధ స్థాయిలలోని సహకార సంఘాల పాలకమండళ్ల కాలపరిమితి ముగుస్తుండడంతో, ప్రస్తుతం కొనసాగుతున్న పాలకమండళ్లనే పర్సన్ ఇన్‌చార్జీలుగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ, సహకార మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బుధవారం ఇక్కడ సమాశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోచారంతో పాటు టి. హరీష్‌రావు, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, ఎం. ఇంద్రకరణ్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాథమిక సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర మార్కెటింగ్ సంఘాలు, రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టీఎస్‌సిఏబీ)ల పాలక మండలి సభ్యులను పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమిస్తూ, ఆరునెలల పాటు అధికారంలో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఆరునెలలలోగా మంత్రివర్గ ఉపసంఘం మరో పర్యాయం సమావేశంమై తదుపరి నిర్ణయం తీసుకుంటుందని పోచారం వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, సహకార శాఖల అధికారులు పాల్గొన్నారు.