తెలంగాణ

యాదాద్రికి గోల్డెన్ టచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం గర్భగుడిని బంగారు రేకుతో అలంకరించాలని యాదగిరి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటిడిఎ) నిర్ణయించింది. భక్తులు ఆలయానికి సమర్పించిన 37 కిలోల బంగారు ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ బంగారాన్ని ఆలయ నిర్మాణానికి వినియోగించేందుకు దేవాదాయ శాఖ అంగీకరించింది. అందుబాటులో ఉన్న మొత్తం బంగారంలో 27 కిలోల బంగారాన్ని గర్భాలయం కోసం, మిగతా బంగారాన్ని ధ్వజస్తంభం, స్వామివారి శయనమందిరం కోసం వాడాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి గర్భాలయాన్ని బంగారుతో తయారు చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. తెలంగాణలో ఇప్పటి వరకు ఏ ఆలయానికి కూడా బంగారుతో తయారు చేసిన గర్భగుడి లేదు. యాదగిరి నర్సింహస్వామి ఆలయం తెలంగాణలో మొట్టమొదటి బంగారు గర్భాలయం అవుతుంది. గర్భాలయంతో పాటు మొత్తం ఏడుగోపురాలు ఈ ఆలయానికి ఉంటాయి. 47 ఫీట్ల ఎత్తు ఉండే గర్భాలయం మొత్తం 32 లేయర్లతో నిర్మిస్తున్నారు. కె. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగా వైటిడిఎ ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ఐఎఎస్ అధికారి జి. కిషన్‌రావును వైస్-చైర్మన్‌గా, మరికొందరు ప్రముఖులను సభ్యులుగా నియమించారు. వైటిడిఎ, దేవాదాయ, గనులు తదితర శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణానికి కావలసిన మెటల్‌ను ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. గతంలో ఉన్న ప్రధాన గుడిని పూర్తిగా అభివృద్ధి చేస్తున్నారు. యాదగిరి గుట్టను 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. కెసిఆర్ స్వయంగా ఈ ఆలయ అభివృద్ధి పనులను తరచూ పర్యవేక్షిస్తున్నారు. దేవాదాయ శాఖ ప్రమేయం ఏమీ లేకుండా ఆలయ అభివృద్ధిని వైటిడిఎకు అప్పగించారు. గర్భాలయంతో పాటు ఆలయం ఎదుట ఉండే ధ్వజస్తంభం, శయనశాలను కూడా బంగారు రేకుతో అలంకరిస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారాలను వెండితో తయారు చేస్తున్నారు. యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది శిల్పులు పాల్గొంటున్నారు.