తెలంగాణ

కొత్త సీఎస్‌గా ఎస్‌కె జోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్రకుమార్ జోషి (ఎస్‌కె జోషి) బుధవారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో కొనసాగిన ఎస్‌పి సింగ్ బుధవారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఎస్‌కె జోషి నియామకానికి ముఖ్యమంత్రి మొగ్గు చూపారు. దీంతో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌కె జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎస్‌కె జోషి పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఉండటంతో సాయంత్రం మూడున్నర గంటలకే ఆయన ఎస్‌పి సింగ్ నుంచి చార్జీ తీసుకున్నారు. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఎస్‌కె జోషి విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలిలో ఎస్‌కె జోషి జన్మించారు. రూర్కీ ఐఐటిలో ఇంజనీరింగ్, ఢిల్లీ ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేసిన అనంతరం జోషి కొంతకాలం పాటు రైల్వేశాఖలో పని చేసాక 1984లో సివిల్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అసిస్టెంట్ కలక్టర్‌గా, సబ్ కలక్టర్‌గా, జాయింట్ కలక్టర్‌గా, కలక్టర్‌గా పని చేసారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జోషి 2019 డిసెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా జోషి మీడియాతో మాట్లాడుతూ, తాను నీటిపారుదలశాఖ కార్యదర్శిగా పని
చేసిన కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కావడంతో దీనిని గడువులోగా పూర్తి చేయాలన్నది కోరికన్నారు. తనకు వ్యక్తిగతంగా అంటూ లక్ష్యాలు ఏమి లేవని ప్రభుత్వ లక్ష్యాలే తన లక్ష్యాలని ఆయన అన్నారు. ప్రధాన కార్యదర్శిగా తనను ఎంపిక చేయడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు జోషి కృతజ్ఞతలు తెలిపారు. ఇలా ఉండగా పదవీ విరమణ చేసిన ఎస్‌పి సింగ్‌ను మిషన్ భగీరథ పథకానికి సలహాదారునిగా నియమించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇలా ఉండగా పదవీ విరమణ చేసిన ఎస్‌పి సింగ్‌కు సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలది ఓపెన్ మైండని, ఎవరినైనా స్వాగతిస్తారన్నారు. తన హయాంలో ప్రపంచ తెలుగు మహాసభలు, మెట్రోరైలు ప్రాజెక్టు ప్రారంభం కావడం మరిచిపోలేని జ్ఞాపకాలన్నారు. తన హయాంలో అధికారులలో ఎలాంటి గ్రూపులను ప్రోత్సహించకుండా అందరినీ కలుపుకుపోయానని అన్నారు.