తెలంగాణ

డబుల్’లో జర్నలిస్టులకు కోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో జర్నలిస్టులకు ప్రత్యేక కోటా విధించడానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం బషీరాబాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించడానికి హెల్త్ కార్డులను జారీ చేసామన్నారు. హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న స్థానిక విలేకరుల సంక్షేమానికి సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నగరంలో నిర్మించే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో మొదటి అంతస్తులో దివ్యాంగులకు కేటాయిస్తున్నామని, రెండో అంతస్తులో స్థానిక విలేకరులకు కేటాయించనున్నట్లు హామీ ఇచ్చారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఉర్దూ విలేకరి కైసర్‌కు ప్రభుత్వపరంగా, తన వ్యక్తిగతంగా సహాయం అందించనున్నట్టు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజెయు నాయకులు కె శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, హెచ్‌యుజె అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, కార్యదర్శి శంకర్‌గౌడ్, ఐజెయు నాయకులు అమర్‌నాథ్, వై.నరేందర్‌రెడ్డి, మాజీద్, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.