తెలంగాణ

హోంగార్డుల జీతాలు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: పోలీసు శాఖలో పని చేస్తున్న హోంగార్డుల జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సిఎం కెసిఆర్ హోంగార్డుల జీతాలు పెంచుతామని చేసిన వాగ్ధానం మేరకు హోంశాఖ బుధవారం జివో జారీ చేసింది. పెరిగిన జీతాల మేరకు నెలకు రూ.20 వేల వరకు హోంగార్డులు తీసుకునే అవకాశం ఉంది. జివోలో పేర్కొన్న మేరకు ప్రతి రోజు రూ.675, ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి వెయ్యిరూపాయల పెంపు, ట్రాఫిక్ విభాగంలో పని చేసే వారికి కానిస్టేబుళ్లతో సమానంగా 30 శాతం ప్రత్యేక అలెవెన్సు, యూనిఫాం అలవెన్సు, మహిళా పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా మహిళా హోంగార్డులకు ఆరు నెలల మెటర్నరీ సెలవు, ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో చనిపోతే హోంగార్డు కుటుంబానికి ఇప్పుడు ఇస్తున్న రూ.5 వేలను రూ.10 వేలకు పెంపు, పోలీస్ యూనిట్ హాస్పిటల్స్‌లో పోలీసులకు అందిస్తున్న వైద్య చికిత్సలు అందజేత, ఆరోగ్య బీమాతో పాటు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విధంగా ప్రభుత్వం జివో జారీ చేసింది. దీంతో పాటు హోంగార్డుల తొలగింపు లేకుండా ఉద్యోగ భద్రతకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది