తెలంగాణ

24 నుంచి టీఆర్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: టీచర్ల రిక్రూట్‌మెంట్ టెస్టు షెడ్యూలును పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రకటించింది. కొన్ని పోస్టులకు ఆన్‌లైన్‌లోనూ, మరికొన్ని పోస్టులకు ఆఫ్ లైన్‌లోనూ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఫిబ్రవరి 24 న ప్రారంభమై మార్చి 4 వరకూ జరుగుతాయి. 24న లాంగ్వేజి పండిట్లు తెలుగు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులకు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఎస్‌జిటి తెలుగు మీడియం పోస్టులకు 25న ఒఎంఆర్ పద్ధతిలో జరుగుతాయి. ఎస్‌జిటి ఇంగ్లీషు మీడియం పోస్టులకు 25 సాయంత్రం జరుగుతుంది. 26న స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ మాథ్స్, ఎస్‌ఎస్ (ఇంగ్లీషు మీడియం) పరీక్షలు జరుగుతాయి. 27న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ (తెలుగు/ఉర్దూ/హిందీ/మరాఠీ మీడియం) కు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అదేరోజు సాయంత్రం లాంగ్వేజి పండిట్లు ఉర్దూ, మరాఠీ, హిందీ సబ్జెక్టులకు ఎంపిక పరీక్ష జరుగుతుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్సు (తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ , హిందీ మీడియం)కు 28వ తేదీ ఉదయం, స్కూల్ అసిస్టెంట్ హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ సబ్జెక్టులకు 28వ తేదీ సాయంత్రం జరుగుతుంది. మార్చి 2న ఎస్‌జిటి (బెంగాళీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఉర్దూ, తమిళం మీడియం) అదేరోజు సాయంత్రం స్కూల్ అసిస్టెంట్ (్ఫజికల్ ఎడ్యుకేషన్) తెలుగు మీడియం పోస్టులకు ఎంపిక పరీక్ష జరుగుతుంది. మార్చి 3న స్కూల్ అసిస్టెంట్ బయాలజీ (ఉర్దూ, మరాఠీ, కన్నడం మీడియం), మాథ్స్ (ఉర్దూ, కన్నడం, మరాఠీ, హిందీ, తమిళం మీడియం), ఎస్‌ఎస్ (మరాఠీ, ఉర్దూ, హిందీ, తమిళం మీడియం) పోస్టులకు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మార్చి 3 సాయంత్రం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ (ఇంగ్లీషు మీడియం )కు ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ, మాథ్స్, సోషల్ - తెలుగు మీడియం) పోస్టులకు 4 ఉదయం, ఫిజకల్ ఎడ్యుకేషన్ టీచర్సు ఇంగ్లీషు మీడియం పోస్టులకు మార్చి 4వ తేదీ సాయంత్రం ఎంపిక పరీక్ష జరుగుతుంది.
గురుకులాల పోస్టులకు షెడ్యూలు
గురుకులాల్లో జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులకు ఫిబ్రవరి 19న, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు ఫిబ్రవరి 20, లైబ్రరియన్ల ఎంపికకు ఫిబ్రవరి 20, స్కూల్స్ ప్రిన్సిపాల్ పోస్టులకు 21న, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులకు 22న, పిడి పోస్టులకు 23న ఎంపిక పరీక్షలు జరుగుతాయి.

బీసీ విద్యానిధి పథకం దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్, జనవరి 31: మహత్మాజ్యోతిబా పూలే బిసి ఓవర్సీస్ విద్యా నిధి పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం ఫిబ్రవరి 15 వరకూ పొడిగించింది. ఈ మేరకు బిసి సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆర్ధికంగా వెనుకబడిన వారికి 15 సీట్లు కలిపి మొత్తం 300 మందికి స్కాలర్‌షిప్ ఇస్తారు. కుటుంబ ఆదాయం కనీసం 5 లక్షలు లోపు ఉండాలి. టోఫెల్‌లో 60, ఇఎల్‌టిఎస్‌లో 6.0, జిఆర్‌ఇలో 260, జిమ్యాట్‌లో 500, పిటిఇలో 50 పాయింట్లు ఏదో ఒక అర్హతతో దరఖాస్తు చేయవచ్చని అధికారులు తెలిపారు.