తెలంగాణ

నాలుగేళ్లలో 1.58 లక్షల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ పెద్దఎత్తున నిధులను అందజేస్తున్నా, టిఆర్‌ఎస్ నేతలు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వ ఆదాయం 3,56,375 కోట్లు కాగా, దాంట్లో కేంద్రం ప్రభుత్వం అందించిన నిధులే 1,58,000 కోట్లు ఉందని అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 21,631 కోట్లు కేటాయించగా, డిసెంబర్ నాటికి మొత్తం 19,601 కోట్లు ప్రభుత్వానికి విడుదల చేసిందని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులపై రాష్ట్ర మంత్రులు తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రానికి 9వేల కోట్లు విడుదల చేసిందని అన్నారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంలో భాగంగా 73.2 కోట్లు కేటాయించగా 69.2 కోట్లు విడుదల చేసిందని అన్నారు. అంగన్వాడీలకు సంబంధించి 272.53 కోట్లు కేటాయించగా ఇప్పటికే మొత్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి అందించిందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం కింద 154 కోట్లు రాష్ట్రానికి అందించిందని తెలిపారు. టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు కోసం 223 కోట్లు కేటాయించగా, 194 కోట్లు ఇప్పటికే విడుదల చేశారని అన్నారు. జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టుకు సంబంధించి 16.57 కోట్లు కేటాయించగా ఇప్పటికే మొత్తం నిధులను విడుదల చేసిందని అన్నారు. గిరిజన పరిశోధనా కేంద్రానికి సంబంధించి 261.5కోట్లు కేటాయించగా 256.8 కోట్లు విడుదల చేసిందని అన్నారు. ఏడు రూరల్ క్లస్టర్స్ అభివృద్ధికి 662 కోట్లు, ప్రత్యేకంగా మిషన్ భగీరథ కోసం 3900 కోట్లు, మిషన్ కాకతీయకు 677 కోట్లు విడుదల చేసిందని, జాతీయ ఆరోగ్య పథకం కింద రాష్ట్రానికి ఈ ఏడాది ఇప్పటికే 1532.88 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. వెనుకబడినర జిల్లాల అభివృద్ధికి ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా 450 కోట్లు అందించిందని చెప్పారు. మొత్తం 2.28 లక్షల ఇళ్లు మంజూరు చేసి 2500 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.