తెలంగాణ

విద్యారంగానికి ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: కేంద్రప్రభుత్వం గురువారం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పైనే అందరి దృష్టీ ఉంది. విద్యారంగానికి గత ఏడాది కంటే ఎక్కువగా నిధులు కేటాయిస్తారనే భావనలో కాలేజీలు, ఇతర యజమాన్యాలు ఉన్నాయి. ఈ ఏడాది 90,842 కోట్లు కేటాయిస్తారని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత అమలుచేసే బడ్జెట్ ఇది. ఈసారి బడ్జెట్‌లో మధ్యాహ్న భోజన పథకానికి, విద్యాహక్కు చట్టం అమలుకు ఎక్కువ నిధులు కేటాయించే వీలుందని అంచనా వేస్తున్నారు. సర్వ శిక్షా అభియాన్‌కు వెయ్యి కోట్లు కేటాయించడంతో బోధన- అభ్యసన ఫలితాలు బాగా మెరుగుపడ్డాయని నిపుణులు చెబుతున్నారు. ఐఐటిలకు 3వేల కోట్లు, 20 విశ్వవిద్యాలయాలకు 10వేల కోట్లు కేటాయించారు. ముఖ్యమైన ఐఐటిలకు 456.10 కోట్లు కేటాయింపులు జరిగాయి. బ్రెజిల్‌లో 2005లో 3.9 శాతం నిధులు కేటాయించగా 2013లో 5.3 శాతం కేటాయించారు. రష్యాలో 3.7 శాతం కేటాయించగా, 2013లో 4.4 శాతం నిధులు కేటాయించారు. దక్షిణాఫ్రికాలో 2005లో 5.7 శాతం, కాగా 2013లో అది 6.9 శాతం నిధులు కేటాయించారు. అదే భారత్‌లో 2005లో 2.6 శాతం నిధులు కేటాయించగా, 2013లో 3.2 శాతం నిధులను కేటాయించారు. 14 ఏళ్ల ప్రాయం వారు 94.7 శాతం, 15 ఏళ్ల ప్రాయం వారు 92 శాతం,. 16 ఏళ్ల వయస్సున్నవారు 87.1 శాతం, 17 ఏళ్ల ప్రాయం వారు 79.3 శాతం, 18 ఏళ్ల ప్రాయం వారు 69.8 శాతం మేర ఎన్‌రోల్‌మెంట్‌లో రికార్డు అయ్యారు.