తెలంగాణ

మహిళలు అత్యంత శక్తివంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: సేవే పరమావధిగా భావించాలి, అప్పుడే ప్రజలు మీకు దగ్గరవుతారు అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లను ఉద్దేశించి పేర్కొన్నారు. మహిళల భద్రతకోసం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక చట్టాలు చేయడంతో పాటు కఠిన నిర్ణయాలను అమలు చేస్తోందని అన్నారు. బుధవారం నాడిక్కడ ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమిలో శిక్షణ పూర్తి చేసుకున్న 735 మంది మహిళా కానిస్టేబుళ్ల అతి పెద్ద బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. వీరిలో 452 మంది సివిల్, 283 మంది ఆర్మ్‌డ్ రిజర్వు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి నరసింహారెడ్డి పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో భాగంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి ప్రసంగిస్తూ సిఎం కెసిఆర్ మహిళలకు పోలీసు దళాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న సంకల్పం మేరకు మీరంతా ఈ రోజు ఉద్యోగాల్లో ఉన్నారని అన్నారు. సాంకేతికపరంగా అత్యున్నత పరిజ్ఞానం ఉన్న డిజిపి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక ప్రయోగాలు చేస్తున్నారని కొనియాడారు. డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు సాధారణ పౌరులుగా ఉన్న మీరంతా సుశిక్షుతులైన, శక్తివంతమైన యూనిఫాం సర్వీసులు కానిస్టేబుల్ ఆఫీసర్లుగా అడుగు పెడుతున్నారని అన్నారు. కొత్త వ్యవస్థలో ఎంతో బాధ్యతగా మెలగాలని సూచించారు. రాగద్వేషాలకు అతీతంగా, ఆశ్రీత పక్షపాతం, అవినీతికి అవకాశం లేని సేవ చేసేందుకు కంకణ బద్దులై ఉండాలని అన్నారు. తొలుత పోలీస్ అకాడమి డైరక్టర్ జితేందర్ శిక్షణ పొందిన కానిస్టేబుళ్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఆయన అకాడమి నివేదిక తెలియజేస్తూ ఈ బ్యాచ్ మొత్తం 769 మంది ఉండగా, శిక్షణ మధ్యలో 34 మంది ఇంతకన్నా మంచి ఉద్యోగాలు రావడంలో రిలీవ్ అయి వెళ్లిపోయారని అన్నారు. మిగిలిన 735 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. ఈ బ్యాచ్‌లో ఆసక్తికరమైన అంశం ఏమంటే 153 మంది పోస్టుగ్రాడ్యుయేట్లు, 32 మంది డిగ్రీ చదివిన వారు, 30 మంది ఎంబిఏ చదివిన వారు కానిస్టేబుళ్లుగా శిక్షణ పొందారని గుర్తుచేశారు.