తెలంగాణ

వృషభ వాహనంపై భద్రకాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్చరల్ (వరంగల్), మే 9: వరంగల్ నగరంలో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవాలయంలో భద్రకాళీ భద్రేశ్వర్లు కల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం రెండవ రోజు అమ్మవారి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ఆదివాసం చేసిన ధ్వజపటాన్ని సోమవారం ఉదయం పల్లకిలో ఉంచి రాజరాజేశ్వరి దేవాలయం నుండి భద్రకాళీ దేవస్థానం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో ధ్వజారోహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి వృషభ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం జింక వాహన సేవను జరిపారు. ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మార్వాడి సమాజ్ వారు ఉభయ దాతలుగా వ్యవహరించి ఆలయానికి విచ్చేసిన భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఉభయ దాతలుగా ఉన్న వారికి ఆలయ అర్చకులు మహాదాశీర్వచనం చేశారు.

చిత్రం అమ్మవారిని వృషభ వాహనంపై ఊరేగిస్తున్న అర్చకులు