తెలంగాణ

దసరా నాటికి కొత్త జిల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 9: వచ్చే దసరా పండుగ నాటికి రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తవుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని, అయితే, ఎన్ని జిల్లాలు అనేది ఇంకా నిర్ణయించలేదని వెల్లడించారు. సోమవారం మంత్రి మిషన్ భగీరథ కింద చేపట్టిన ఎల్‌ఎండిలోని క్లియర్ వాటర్ రిజర్వాయర్, ఎల్‌ఎండి డ్యాం వద్ద ఇంటెక్‌వెల్, ఉజ్వల పార్కు వద్ద నగరానికి నీటిసరఫరా చేసే విధానం, ఎలగందుల వద్ద వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, క్లియర్ వాటర్ సంప్ నిర్మాణం తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాటర్ గ్రిడ్ ద్వారా 2017 చివరి నాటికి ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని అన్నారు. ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. వాటర్ గ్రిడ్ పనులను 2017 చివరి నాటికి పూర్తి చేసేందుకు పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను తనిఖీ చేయడం ద్వారా ఏమైనా సమస్యలుంటే తమ దష్టికి వస్తాయని, వాటిని వెంటనే పరిష్కరించి నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసేందుకు వీలవుతుందని అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా కొన్ని వేల కోట్లు వెచ్చించి వాటర్ గ్రిడ్ పనులు చేపట్టిందని, పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించి మన్నికగా పదికాలాల పాటు ఉపయోగపడేలా పనులు ఉండాలని తెలిపారు. ఇప్పటివరకు ఎల్‌ఎండి నుండి కరీంనగర్ నగరానికి తాగునీటి అవసరాలకు వాడుకుంటున్నామని, వాటర్ గ్రిడ్ ద్వారా ఎల్‌ఎండి నుండి నీటిని హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు మానకొండూర్ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు, వరంగల్ జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో వాటర్ గ్రిడ్ ద్వారా జిల్లాలో ఎంత కరువున్నా తాగునీటికి మాత్రం ప్రజలకు ఇబ్బంది రాకుండా సరఫరా చేస్తామని తెలిపారు. జిల్లా సాగు, తాగునీటికి జంక్షన్‌గా మారుతుందని అన్నారు. వచ్చే జూన్‌లో మిడ్‌మానేరులో 3టిఎంసిల నీటిని ఆపుతామని చెప్పారు. 2017 నాటికి మిడ్‌మానేరు ఫ్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం కోసం కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, కరీంనగర్, చొప్పదండి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బొడిగ శోభ, మేయర్ రవీందర్ సింగ్, మిషన్ భగీరథ ఎస్‌ఇ శ్రీనివాస్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఇ సూర్య ప్రకాష్, కరీంనగర్, సిరిసిల్ల ఆర్‌ఢిఓలు చంద్రశేఖర్, భిక్షనాయక్, ప్రజాప్రతినిధులు, తహశీల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం ఎల్‌ఎండిలో మిషన్ భగీరథ పనులను పరిశీలిస్తున్న మంత్రి ఈటల రాజేందర్