తెలంగాణ

డీడీ యాదయ్య చాంబర్‌లో ఏసీబీ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 15: రూ.లక్ష లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు అడ్డంగా దొరికిన సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పెరుక యాదయ్య ఛాంబర్‌లో గురువారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు గంటలకు పైగా చేపట్టిన తనిఖీల్లో యాదయ్యపై వచ్చిన పలు ఫిర్యాదుల మేరకు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళతోపాటు, ఎన్ని రోజుల నుంచి, ఎందుకోసం పెండింగ్‌లో ఉన్నాయో సంబంధిత సెక్షన్‌ల ఇన్‌చార్జిలను ఒక్కొక్కరినీ అడిగి తెల్సుకున్నారు. అలాగే, సేవాకాల చరిత్రను తన సర్వీసు పుస్తకంలో పరిశీలించారు. సాంఘిక సంక్షేమ శాఖ విభాగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు పొందిన వేతనం సర్వీసు పుస్తకం ద్వారా లెక్కిస్తూ, ఇప్పటివరకు పొందిన వేతన మొత్తం, ప్రస్తుతం ఉన్న ఆస్థుల వివరాలు కూడా సేకరించినట్టు తెలుస్తోంది. కింది స్థాయి సిబ్బందిపట్ల వ్యవహరించిన తీరుపై కూడా ఆరాతీసారు. తన వద్దకు వచ్చే ప్రతి ఫైలుకు లెక్కకట్టే డిడి యాదయ్యతో మొత్తం సిబ్బంది ఇబ్బందులకు గురువుతున్నట్లుగా ఏసీబీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. అలాగే, ఆదాయానికి మించిన ఆస్తులు ,కూడబెట్టినట్లు ఫిర్యాదులు రాగా, తన సొంత జిల్లా నల్గొండతో పాటు, హైద్రాబాద్‌లలో కూడి అవినీతి నిరోధక శాఖాధికారులు యాదయ్య ఇళ్ళలో సోదాలు చేస్తున్నట్లు వినికిడి. ఏసీబీ అధికారుల తనిఖీల్లో డిడి ఛాంబర్‌లో అనేక ఫైళ్ళు పెండింగ్‌లో ఉండటాన్ని గమనించిన అధికారులు వాటిపై ఆరాతీసి, సంబంధిత బాధ్యులను పిలిపించనున్నట్టు వెల్లడించారు. అవసరమైన కొనుగోలు బిల్లుల నుంచి మొదలు వివిధ కాంట్రాక్టులకు సంబంధించిన పెద్ద మొత్తంలో బిల్లుల ఫైళ్ళు ఉన్నట్లు కార్యాలయ వర్గాల సమాచారం. మరింత లోతుగా విచారించేందుకు హైద్రాబాద్ తరలించనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

చిత్రం..డీడీ యాదయ్య చాంబర్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న దృశ్యం