తెలంగాణ

యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 17: లోక సంరక్షణ, విశ్వశాంతిని కాంక్షిస్తూ తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధినొందిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థానం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు నందీగల్ నరసింహాచార్యులు నేతృత్వంలోని అర్చక పండిత బృందం శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం స్వామివారి బాల ఆలయంలో శ్రీ మహావిష్ణువు సర్వసేనానియైన విష్వక్సేనుడి ఆరాధనతో, స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. వేద పారాయణలతో జలపూజ, శుద్ధిపర్వాలు, రక్షా బంధనం, నవ ధాన్యాలతో ఉత్సవాలకు అంకురార్పరణ చేశారు. అంతకుముందు స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి తిరుమంజసం నిర్వహణతో మేళ తాళాలు, నాదస్వరాల మధ్య బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం చేశారు. ఆలయ ఈవో గీత, కలెక్టర్ అనితారామచంద్రన్, అనువంశ ధర్మకర్త నరసింహాచార్యులు, రాచకొండ కమిషనర్ ఎం.్భగవత్, జెసి రవిలకు అర్చకులు కంకణధారణ చేశారు. గర్భాలయంలో సంప్రదాయనుసారం మూల విరాట్‌లకు ఉత్సవ పూజలు, శుద్ధిపర్వాలు నిర్వహించి బాల ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలను ఆరంభించారు. సాయంత్రం 6:30గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణం పూజాధికాలు, చతుర్వేద పారాయణాలు నిర్వహించారు. జగత్‌ద్రక్షకుడైన స్తంభోద్భవుడు యాదరుషి కోరికతో యాదాద్రిపై పంచనారసింహుడిగా కొలువైన లక్ష్మినరసింహుడికి ప్రధాన ఆలయం పునర్ నిర్మాణం జరుగుతున్నందునా వరుసగా రెండో ఏడాది కూడా స్వామి వారి బ్రహ్మోత్సవాలు బాల ఆలయంలో గడప లోపలే సాగుతున్నాయి. పంచనారసింహుడి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు ఆదివారం ఉదయం 11గంటలకు ధ్వజారోహణ, సాయంత్రం 6:00 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోమవారం నుండి స్వామివారికి అలంకార, వాహన సేవలు ప్రారంభమవుతాయి. 24న స్వామివారి తిరుకల్యాణోత్సవం, వైభవోత్సవ కల్యాణాలు నిర్వహిస్తారు. ఈనెల 22నుండి 26వరకు నాలుగు రోజుల పాటు ధార్మిక, సాహిత్య, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

చిత్రం..బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకలో లక్ష్మీనరసింహుల ఉత్సవ విగ్రహాలు