తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డితో పాటు నూతన రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, కె.శివకుమార్, అధికార ప్రతినిధిగా కొండా రాఘవ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్యప్రకాశ్, హెచ్‌ఎ రెహమాన్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి శుభాకాంక్షలు తెలిపారు.