తెలంగాణ

ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్యాల, ఫిబ్రవరి 25:పూర్వ కరీంనగర్ జిల్లా దేవాలయాల జిల్లాగా పేరుగాంచిందని అట్టి అధ్యాత్మికతను చాటుతూ పూర్వ వైభవాన్ని కాపాడే విధంగా అభివృద్ది చేయాలని దీక్షా పట్టుదలతో వేములవాడ, కాళేశ్వరం, కొండగట్టు, ధర్మపురి, ఆలయాలను అన్ని రకాల అభివృద్ది చేయడంలో చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన ఆదివారం కొండగట్టు శ్రీ అంజనేయస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ. 2.5 కోట్లతో నిర్మించనున్న మాలవిరమణ భవనానికి భూమిపూజ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రూ. 5కోట్లతో కొండగట్టులో అభివృద్ది పనులు మెట్ల రహదారి, మాల విరమణ భవనానికి రూ. 5 కోట్లు ప్రభు త్వం విడుదల చేసిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని విధాల ఆలయాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కోనేటిలో నీటి కొరత ఉందని, వచ్చే యేడాది బ్రహ్మండంగా నిధులు వెచ్చించి నూతన కోనేరులో రెగ్యూలర్‌గా నీటిని నింపి భక్తులకు స్నానాలు అచరించే ఇబ్బందులు తొలగిస్తామన్నారు. దేవాలయాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ఖజాన నుండే నిధులు ఇస్తున్నట్లు ఆలయాలకు ఖర్చు పెట్టే రాష్ట్రం దేశంలోనే లేదని ప్రభుత్వం ఎంతో గొప్పగా పని చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో కరీంగనర్ ఎంపి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే బొడిగె శోభ, అర్డీఓ నరేందర్, అలయ ఎఇఒ బుద్ది శ్రీనివాస్, టిఆర్‌ఎస్ నేతలు బొడిగె గాలన్న, బొట్ల ప్రసాద్, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.