తెలంగాణ

పిఎసి అంటే పట్టింపు ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: ఒకటి కాదు, రెండు కాదు కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వివరాణాత్మక నివేదికలు అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి)కి చేరడం లేదు. పిఎసి చైర్‌పర్సన్‌గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జె.గీతారెడ్డి సోమవారం విస్తుపోయారు. అయితే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆమెకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జె.గీతారెడ్డి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోమవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాలులో పిఎసి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, ఫారూఖ్ హుస్సేన్, ఆడిటర్ జనరల్, అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ 15 నుంచి 20 సంవత్సరాలుగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వివరాణాత్మక నివేదికలు రాకపోవడంపై చైర్‌పర్సన్ గీతారెడ్డి, పిఎసి సభ్యులు నిలదీశారు. సుమారు 155 వివరణాత్మక నివేదికలు పిఎసికి అందాల్సి ఉందని చైర్ పర్సన్ అన్నారు. అందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్పందిస్తూ ఇకమీదట ఇలా జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ శాఖల నుంచి పిఎసికి పంపించాల్సిన వివరణాత్మక నివేదికలు (ఎక్స్‌ప్లెనరీ నోట్స్) ఎప్పటికప్పుడు పంపించేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.
వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన నిధుల వినియోగం, కాంట్రాక్ట్ పనులు, ఇతరత్రా అంశాల్లో అభ్యంతరాలు ఉంటే ఆడిటర్ జనరల్ అసెంబ్లీకి తెలియజేస్తారు. ఆ అభ్యంతరాలపై నోట్స్ అందజేయాల్సిందిగా అసెంబ్లీ ఉన్నతాధికారులు ప్రభుత్వంలోని ఆయా శాఖలకు తెలియజేస్తారు. దీనిపై ఆయా శాఖలు మూడు నెలల్లోగా వివరణాత్మక నివేదికలు పంపించాల్సి ఉంటుంది. ఆ వచ్చిన నోట్స్‌ను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు అసెంబ్లీ అధికారులు పెడతారు. ఆ నోట్స్‌పై కమిటీ సభ్యులు చర్చించి, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పీఏసీ సిఫార్సు చేస్తుంది. కాగా రెండు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి వివరణాత్మక నివేదికలు రావడం లేదు. దీనిపైనే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ జవాబుదారీతనం ఉండాలంటే తప్పని సరిగా పిఎసికి ఎప్పటికప్పుడు వివరణాత్మక నివేదికలు పంపించాల్సిందిగా చైర్ పర్సన్, సభ్యులూ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నెల 20న మరోసారి సమావేశమై మున్సిపల్, పర్యాటక శాఖలపై సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు.

చిత్రం సోమవారం పిఎసి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అసెంబ్లీలోని కమిటీ హాలులో నిర్వహించిన
సమావేశంలో ప్రసంగిస్తున్న చైర్మన్ గీతారెడ్డి