తెలంగాణ

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేద్దామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేద్దామా? అని టి.కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల బలబలాల ప్రకారం పోటీ చేసి గెలుపొందడం చాలా కష్టమని తెలిసినా, కనీసం ఫిరాయింపుదారులైన తమ ఎమ్మెల్యేలకు ‘విప్’ జారీ చేసేందుకైనా ఉపయోగపడుతుంది కదా? అని కొంత మంది నాయకులు టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. పోటీ చేస్తే గెలుపొందాలే తప్ప, పోటీ చేసి ఘోర ఓటమి అని పత్రికల్లో పతాక శీర్షికల్లో రాయించుకున్నట్లే అవుతుంది కదా? అని ఉత్తమ్ అభిప్రాయపడినట్లు సమాచారం. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు నిర్వహించే సిఎల్‌పి సమావేశానికి హాజరుకావాల్సిందిగా, ఆ తర్వాత పోలింగ్‌కు హాజరుకావాల్సిందిగా ‘విప్’ జారీ చేయగలమే కానీ, ఎవరికి ఓటు వేయాలన్నది ‘విప్’లో పేర్కొనలేం అనే విషయాన్నీ ఉత్తమ్ ప్రస్తావించారు. కాబట్టి వృధా ప్రయాసే అవుతుందన్న భావనతో ఆయన ఉన్నా, కొంత మంది ఆయనపై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు: ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కె. జానారెడ్డి, భట్టి విక్రమార్క, జె. గీతారెడ్డి, డికె అరుణ, పద్మావతి, టి. జీవన్‌రెడ్డి, టి. రాంమోహన్ రెడ్డి, జి.చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే దొంతు మాధవ రెడ్డి.