తెలంగాణ

నిరుద్యోగ సమస్యపై పోస్టు కార్డుల ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: నిరుద్యోగ సమస్యపై గాంధేయ మార్గంలో ప్రభుత్వపై పోరాడేందుకు టీ జేఏసీ కార్యచరణ సిద్దం చేసుకుంది. ఇందులో నియామకాల అవశ్యకతను తెలియజేందుకు రెండు లక్షల పోస్టుకార్డులను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోస్టుకార్డుల నిరసన ఉద్యోమంలో నగరం నుంచి సేకరించిన 20వేల పోస్టుకార్డులను జేఏసీ చైర్మన్ కోదండరామ్ ప్రదర్శించారు.
అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని అన్నారు. ముఖ్యమైన నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటాన్ని యువకులు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. ప్రాణాలను సైతం పనంగా పెట్టి సాధించుకున్న తెలంగాణలో తమ గోడు వినేవారే లేరని నిరుద్యోగులు ఆవేదనతో ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో వారి ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా శాంతియుతంగా నిరుద్యోగుల సభను నిర్వహించుకుంటామని చెప్పినా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వాపోయారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతులు పొందినా ఎన్నో అడ్డంకులను సృష్టించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య యుతంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను వినేందుకు ఇష్టపడక పోవడం విచారకరమన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నియామకాలు చేపట్టలేని పరిస్థితిలో యువతకు నిరుద్యోగ భృతిని అందించి ఆదుకోవాలని డిమాం డ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎర్రమంజిల్‌లోని పోస్టు ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లి కార్డులను పోస్టు చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ జేఏసీ నాయకులు వెంకట్ రెడ్డి, సత్యం, ప్రభాకర్ రెడ్డి, బలరాం, రమేష్, అర్జున్, విద్యాసాగర్ పాల్గొన్నారు.