తెలంగాణ

హామీలపై కేంద్రాన్ని నిలదీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు మార్గదర్శకం చేయాడినికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ భవన్‌లో శనివారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని నిలదీయడంతో పాటు జిఎస్‌టి అమలు తర్వాత రాష్ట్రానికి తగ్గిన ఆదాయాన్ని కేంద్రమే పూడ్చాలని వత్తిడి తీసుకరావడానికి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు కెసిఆర్ వివరించనున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరగడం పట్ల టిఆర్‌ఎస్ కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వానికి సఖ్యత పక్షంగా వ్యవహరిస్తూ, అనేక కీలక అంశాలలో ప్రధాని మోదీకి అండగా నిలిచినప్పటికీ కేంద్రం నుంచి ఆ స్థాయిలో సహాయ, సహకారాలు అంద డం లేదని ఇటీవల కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ బహాటంగానే ప్రధానిపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కేంద్రంతో సఖ్యతగా ఉండటం వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదన్న అభిప్రాయాన్ని పార్టీ ఎంపి కల్వకుంట్ల కవిత కూడా తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేసారు. రాష్ట్ర విభజన జరిగి దాదాపు నాలుగు సంవత్సరాలు గడుస్తోన్నా ఇప్పటికీ హైకోర్టు విభజన జరుగకపోవడాన్ని టిఆర్‌ఎస్ తీవ్రంగా పరిగణిస్తోంది.
దేశంలో మరెక్కడా లేని విధంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం నుంచి సాయం అందడం లేదు. ఈ రెండు పథకాలకు కలిపి రూ. 19 వేల కోట్ల మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేయాలని నీతి ఆయోగ్ స్వయంగా కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే రూ. లక్ష కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును జాతీ య ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసినా పట్టనట్టుగా వ్యవహరించడం పట్ల టిఆర్‌ఎస్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇంతకుముందు మాదిరిగా కేంద్రంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, ఇక నుంచి కాస్త కటువైన వైఖరినే అవలంభించబోతున్నట్టు సిఎం కెసిఆర్ ఇప్పటికే పార్టీ ఎంపీలకు సంకేతాలు ఇచ్చారు. సిఎం కెసిఆర్ తన వైఖరిని ఇటీవల బహిరంగ సభలో వ్యక్తం చేయడంతో ఇదే విషయాన్ని పార్టీ ఎంపీలకు వివరించనున్నట్టు సమాచారం.
కేంద్రంపై టిఆర్‌ఎస్ ఇక నుంచి అనుసరించే వ్యూహం ఈ నెల 5 నుంచి తిరిగి ప్రారంభం కాను న్న పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు అనుసరించనున్నారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని నిలదీయడానికి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కెసిఆర్ మార్గదర్శకం చేయనుండటంతో ఇది కీలక సమావేశంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా ఉండగా ఇటీవల ప్రధాని మోదీపై సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
రాజ్యసభ సీట్ల ఎంపికపై కూడా చర్చ
తెలంగాణ నుంచి రాజ్యసభలో మూడు స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై ఎంపీలతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సమావేశంలో చర్చించనున్నట్టు టిఆర్‌ఎస్ వర్గాల సమాచారం. పార్టీ సంస్థాగత కోటాలో ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఎంపిక దాదాపు ఇప్పటికే ఖరారు అయిన విషయం తెలిసిందే. ఇంతకాలంగా పార్టీకి సంతోష్‌కుమార్ అందించిన సేవలకు గుర్తింపుగా రాజ్యసభ సీటు ఇవ్వాలని దాదాపు పార్టీ ముఖ్య నేతలంతా సిఎం కెసిఆర్‌కు సూచించారు. ఇదే విషయాన్ని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మరోసారి కెసిఆర్ దృష్టికి తీసుకరానున్నట్టు ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి యాదవ, కుర్మ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పించనున్నట్టు సిఎం కెసిఆర్ ఇది వరకే ప్రకటించారు.